Control High Blood Pressure Without Medicines

బిపి సెకండ్స్ లో తగ్గించి లైఫ్లో రాకుండా చేసి టాప్ టెన్ గోల్డెన్ టిప్స్ మంతెన సత్యనారాయణ రాజు

రక్తపోటు వయసుతో సంబంధంలేకుండా అనేక అనారోగ్యాలకు కారణమయ్యే ఒక వ్యాధి. రక్తపోటుకు ముఖ్యకారణం ఉప్పు. ఉప్పు వలన రక్తపోటు పెరగడంతో పాటు రక్తనాళాలను గట్టిపరిచే గుణం ఉంటుంది. దీనివలన రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. దాంతో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  

అందుకే రక్తపోటు కు ఇచ్చే మందులన్ని రక్తనాళాలు వ్యాకోచించడానికి ఇచ్చేవే. అవి రక్తనాళాలను మెత్తగా చేసి రక్తసరఫరాను అడ్డుకోకుండా ఉంటాయి.  ఉప్పు విషయంలో జాగ్రత్త పడితే రక్తనాళాలు సహజంగా సాగుతాయి. జీవితంలో ఒకసారి బి.పీ వస్తే ఇకపోదు అంటారు.కానీ ఉప్పు తగ్గించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే తగ్గే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 మన శరీరానికి రోజుకి 250మిగ్రాముల సోడియం సరిపోతుంది. కానీ మనం ఐదారువేల మిల్లీగ్రాముల నుండి పదివేల మిగ్రాముల వరకూ తీసుకుంటున్నాం. అందుకే వీలైనంత తగ్గించడం కోసం మధ్యాహ్నం పూట ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలో ఉప్పు తక్కువ పడుతుంది. పప్పులతో కలిపి పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. 

పెరుగన్నం మజ్జిగన్నంలో ఉప్పు లేకుండా తినడం అలవాటు చేసుకోండి. హై పొటాషియం డైట్స్ అంటే పండ్లు. వండితే పొటాషియం తగ్గిపోతుంది. పొటాషియం ఎక్కువయితే సోడియంని బయటకు పంపిస్తుంది. వండకుండా నాచురల్ డైట్ అంటే పండ్లు. ఆరేడు గంటల కల్లా కడుపునిండా పండ్లు తినేయాలి. 

రాత్రుళ్ళు, ఉదయం ఇలా నాచురల్ డైట్ తీసుకుంటూ మధ్యాహ్నం ఉప్పు తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే త్వరగానే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ప్యాకేజి, కాన్ ఫుడ్ తగ్గించాలి. మసాలాలు, వేపుడు పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఇందులో అధికంగా సోడియం ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. నూనెలు, ద్రవరూపంలో ఉన్న కొవ్వులు రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఆవకాయలు, ఊరగాయల్లో కొవ్వులు ఎక్కువ ఉంటాయి కనుక దూరం పెట్టాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్, సిగరెట్ వలన రక్తనాళాలు మూసుకుపోతాయి కనుక వీలైతే మానేయాలి లేదా పరిమితంగా వాడాలి. ఉప్పును తగ్గించి పండ్లను రోజులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. మంచినీటిని రోజుకు మూడు నాలుగు లీటర్ల మధ్య తీసుకోవాలి. వ్యాయామం, నడక అలవాటుగా చేస్తూ ఉంటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

Leave a Comment

error: Content is protected !!