Coriander Seeds Health benefits in telugu

కేవలం అర స్పూన్-కీళ్ల నొప్పులు,కొలస్ట్రాల్,గ్యాస్,అధిక బరువు,డయాబెటిస్ వంటి సమస్యలు జీవితంలో లేకుండా

ప్రతి వంటింటిలోనూ  తప్పకుండా ఉండే మసాలా దినుసు ధనియాలు. ధనియాలు యొక్క ఉపయోగాలు అన్నీ ఆరోగ్యకరమైనవే. రోజుకో అరస్పూన్ తీసుకోవడం వలన కీళ్ళ నొప్పులు, కొలస్ట్రాల్, గ్యాస్, అధికబరువు, డయాబెటిస్ తగ్గడంలో అద్బుతమైన ఫలితాలు ఇస్తుంది. అంబులఫెరీ కుటుంబానికి చెందిన ధనియాలు శాస్త్రీయనామం కొరియాడ్రం సటైవా. దీనిని ఇంగ్లీషు లో కొరియాండర్ అంటారు. మసాలాలలో ధనియాలు ఉంటే వాసన చాలా బాగుంటుంది. ధనియాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 ధనియాలలో పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, కె,సి, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఆయుర్వేదంలో చర్మసమస్యల నివారణ కోసం కూడా ధనియాలు ఉపయోగిస్తారు. తామర, గజ్జి, దద్దుర్లు వంటివాటికి చికిత్స లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ధనియాలలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. నోటిపూత, పుండ్లను కూడా తగ్గిస్తుంది. ధనియాలలో ఫినలోనిక్ ఆమ్లం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో  ధనియాలను నీటిలో మరిగించి తాగుతు ఉండాలి. సరైన పోషకాహరం తీసుకోకపోవడం, బలహీన మైన జుట్టు పాలికల్స్, హర్మోన్ల అసమానతలు, ఒత్తిడి వంటి సమస్యలతో జుట్టు రాలిపోవడం ఎక్కువయిన తరుణంలో ధనియాలు తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా  బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండడంవలన మలబద్దకం తగ్గించి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం బాగా జీర్ణమయి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు తగ్గిస్తుంది. గ్యాస్ సమస్యలకు ధనియాలు మంచి మందు. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ధనియాలు శరీరంలో కొవ్వును పీల్చుకునే పద్థతిని మెరుగుపడేలా చేస్తుంది. చెడుకొవ్వును కరీగించి మంచికొవ్వును పెంచుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు గుండెజబ్బులకు కారణమవుతుంది. అవి రెండు అదుపులో ఉండే గుండె ఆరోగ్యం గా ఉంటుంది. జలుబు, ప్లూ రాకుండా చేస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. కాన్సర్ కణాలతో పోరాడతాయి. నాణీకణ నష్టం జరగకుండా చేసి జ్ఞాపకశక్తి ని పెంచుతుంది. కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు కలిగించే ప్రీరాడికల్స్తో పోరాడతాయి. అదనపు నూనెను గ్రహించే లక్షణంవలన ఆయిల్ స్కిన్ వారికి సహాయపడుతుంది. 

ధనియాలలో సినోల్, లినోలినిక్ ఆమ్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు వలన కీళ్ళు, వెన్నునొప్పులను తగ్గిస్తుంది. ధనియాలు కషాయంలో తేనెకలిపి తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. ధనియాలలో లినోల్ అనే ఆమ్లం ఒత్తిడి ని తగ్గిస్తుంది. టైఫాయిడ్ కి కారణమయ్యే బాక్టీరియాతో పోరాటంచేస్తుందని నిరూపితమయింది.ధనియాలపొడి లో పసుపువేసి కలిపి మొటిమల మచ్చలపై రాస్తే మచ్చలు తగ్గుతాయి. ధనియాలు వేడిచేసినపుడు తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తాయి. మూత్ర, కాలేయ,జీర్ణాశయ సమస్యలు తగ్గిస్తాయి. ఇంత ఉపయోగకరమైన ధనియాలు చిన్నవైనా ఉపయోగంలో పెద్దవని తెలుస్తున్నాయి కదా.

Leave a Comment

error: Content is protected !!