cost effective rich in calcium foods

అంతులేని క్యాల్షియం వీటిలో లభ్యం ఇక తిరిగి లోని ఆరోగ్యం మీ సొంతం..

మన అందరికీ కాల్షిరం అనేది ఒక రోజుకి 450 మిల్లీగ్రాముల వరకూ  పెద్దలకు కావాలి ముఖ్యంగా. మరి వయసులో ఉన్న పిల్లలకు 600 మిల్లిగ్రాముల కావాలి. 20 సంవత్సరాల లోపు వారందరికీ 500 మిల్లీగ్రాముల కాల్షియం ఒకరోజు కావాలి. కాల్షియం వలన  ఎముకలు బలంగా ఉంటాయి మరియు క్యాల్షియం శరీరానికి ఒంటపట్టాలంటే విటమిన్ డి అనేది ఒకటి కావాలి. మీరు అందరూ ఒకసారి డాక్టర్ తో చెకప్ చేయించుకోండి. నూటికి 90మంది విటమిన్ డి లోపం ఉంది. అంటే విటమిన్ డి లేకపోతే  మీరు ఆహారంగా తీసుకున్న కాల్షియం మలవిసర్జన ద్వారా బయటకు వెళ్లి పోతుంది. 

ఎంత కాల్షియం అందించినప్పటికీ ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువ శరీరానికి అందాలి. మరి ఎట్లా అందుతుందన్న ఆలోచన చేస్తే అందరూ చెప్పే సమాధానం అంటారు పాలలో క్యాల్షియం ఉంది ఎంత కాల్షియం పాలలో 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాములుగేదెపాలలో 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కానీ మనకు మార్కెట్లో దొరికే పాలలో సగానికి సగం నీళ్ళు కలుపుతారు.అప్పుడు ఒక గ్లాసు గేదెపాలకు చిక్కటి గ్లాసు ఆవుపాలు సమానంగా ఉంటాయి. 

కాబట్టి మీకు ఒకరోజు పూర్తిగా కాల్షియం కావాలంటే ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒకగ్లాసు పాలు తాగించాలి. అందుకని మీరు ఏం చేస్తుంటారు సుమారు 35, 40 రూపాయలు పాలకోసం ఖర్చు అవుతున్నది.పాలు పాతిక రూపాయలు పొడి పంచదార ఇంకో 15 రూపాయలు క్యాల్షియం కోసం కోసం మాత్రమే  ఖర్చుపెడుతున్నాం. పాలలో క్యాల్షియం  కంటే ఎక్కువ కాల్షియం ఆకుకూరల్లో లభిస్తుంది. కానీ ఇలాంటి ఆహారం ఏది అనేది చేసి అనగానే డాక్టర్ గారు ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వీటి గురించే ఎక్కువగా అవగాహన ఉండవు కాబట్టి.   397 మిల్లీగ్రాముల క్యాల్షియం 100 గ్రాముల తోటకూరలో, సుమారుగా 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీ గ్రాముల కాల్షియం, 100 గ్రాములు పాలకూరలో 510 మిల్లీగ్రాముల కాల్షియం, 100 గ్రాముల కరివేపాకులో ఏడు వందల ముప్పై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

 పాలకంటే త్రీ టైమ్స్  ఫైవ్ టైమ్స్  అంటే 500 నుంచి 600 మిల్లీగ్రాముల కాల్షియం ఎక్కువుంటుంది. 35, 40 రూపాయలు ఖర్చు పెట్టి పాలు తాగే కంటే రెండు రూపాయల ఖర్చుతో క్యాల్షియం రోజు మొత్తానికి ఆకుకూరలు  నుండి లభిస్తుంది.పల్లెల్లో గట్లమీద పొలాల్లో పొన్నగంటికూర, చిలకతోటకూరలు దొరుకుతాయి.  ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఊరికే కాల్షియం దొరుకుతుంది.

అలాగే ఎదిగే పిల్లలకు నువ్వులుండ పెట్టమంటారు. ఓక నువ్వులుండలో450 మిల్లీగ్రాముల కాల్షియం  ఉంటుంది. నువ్వులలో కాల్షియం ఎక్కువ అందుకని రోజుకు ఒక వుండ తింటే  తప్పులేదు. అందుకనే మన పూర్వీకులు నువ్వు భోజనం తిన్నాకా ఒక నువ్వులుండ తిను.ఒంటికి బలం అనేవారు. అదే నువ్వుల నుండి లభించే కాల్షియం, బెల్లంనుండి లభించే ఐరన్.  పిల్లల కోసం పాలు ఇవ్వడం తగ్గించి సంప్రదాయ వంటలు, బెల్లం లడ్డూలు పెట్టండి. అలాగే ఆకకూరలు అలవాటు చేయండి. 

Leave a Comment

error: Content is protected !!