cough and cold remedy with lemon

భయంకరమైన వైరస్తో వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి ని తగ్గించుకోండిలా..

ఈ వైరస్ ముఖ్యంగా మన శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ములు అనేవి చిన్న సమస్యలుగా కనిపిస్తాయి. కానీ వీటి వలన చాలా అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు వైరల్ ఫీవర్లు కూడా దాడి చేస్తాయి. ముఖ్యంగా దగ్గు అనేది ఒక్కసారి వచ్చింది అంటే  చాలా కష్టం. ఎన్ని రకాల యాంటీబయోటిక్, టానికులు వాడినా దగ్గు అనేది త్వరగా తగ్గదు. వీటిని కూడా త్వరగా తగ్గించి అద్భుతమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 ఒకటిన్నర గ్లాసుల నీటిని తీసుకోండి. అదే మీరు రోజు మొత్తం చేసుకోవాలి అనుకుంటే ఒక రెండు గ్లాసుల నీటిని తీసుకొని ముందుగా మనకు కావాల్సిన వాళ్ళని నేను ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి. ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఈ అల్లాన్ని  బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని దీనిపైనా తోలు తీసేయాలి. తర్వాత మీరు ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో అధికంగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి బాగా మేలు చేస్తాయి. అలాగే గొంతు నొప్పి సమస్యలు తగ్గించడానికి ఒక పురాతన ఆయుర్వేద ఔషధం అని చెప్పుకోవచ్చు.

 అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది బేలీఫ్.  బిర్యానీ ఆకు అని కూడా అంటారు. ఈ బిర్యానీ ఆకులలో కూడా అనేక రకాల హెల్త్ ప్రాపర్టీస్  ఉంటాయి. ఇందులో 1 లేదా 2 బిర్యానీ ఆకులు కూడా ఆడ్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఒక నాలుగు మిరియాలు అలాగే ఒక రెండు లేదా మూడు లవంగాలు, రెండు ఏలకులు. మీరు ఏం చేయాలి అంటే వీటన్నిటినీ ఒక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని పొడి చేసుకోండి. ఇది కేవలం మసాలా దినుసుల్లా మాత్రమే చూస్తాం. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శక్తిని పెంచడానికి మాత్రమే కాకుండా దగ్గు, జలుబు తగ్గించడానికి బాగా పనికి వస్తాయి కదా.

 బ్లాక్ సాల్ట్ మీరు ఒక రుచికి తగినంత ఆడ్ చేయండి.బిపీ  లేకపోతే మీరు బ్లాక్ సాల్ట్ ఉపయోగించండి.ఇందులో  విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు ఇందులో తులసి ఆకులు వేయండి. మీరు ఒక ఆరు లేదా ఏడు తులసి ఆకులను కూడా యాడ్ చేయాలి. తులసి మొక్కలోని ఔషధ గుణాలు కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాకుండా ఇలాంటి లక్షణాలను నివారించడానికి బాగా ఉపయోగపడతాయి.చాలామంది తులసిఆకులు అందుబాటులో లేవు అంటూ ఉంటారు. అలాంటి వారు అవిలేకపోయినా తులసి డ్రాప్స్  అయినా వేసి చేసుకోవచ్చు.  

ఇప్పుడు మనకి కావాల్సింది బెల్లం. నహ ఒక చిన్న బెల్లం ముక్క కూడా తీసుకొని ఆడ్ చేయండి. పాతబెల్లం లేకపోతే బ్రౌన్ కలర్ లో ఉన్న బెల్లం మాత్రమే యాడ్ చేయండి. ఇది మన శరీరంలో ఇమ్యునిటీ పవన్ మాత్రమే కాకుండా మన శరీరంలోని మలినాలను బయటకు పంపి అనారోగ్యాలను దూరం చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఇందులో కలపవలసింది మీరు ఒక అర స్పూన్ వాము కూడా తీసుకొని కూడా యాడ్ చేయండి. ఇందులో ఉండే ఆయుర్వేదిక్ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ గొంతు నొప్పిని తగ్గించడానికి ఇవి బాగా పని చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అనుకుంటున్నారా? దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడిని లేకపోతే ఎక్కువగా ఉంటాయి.

 ఇవి శరీరంలోని వైరస్ ను అంతం చేయడానికి బాగా పనికి వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనీసం ఒక ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఇప్పుడు మనం కలపవలసిన పసుపు.ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక రకాల వైరస్లు నిరోధించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. పావుస్పూన్ పసుపు యాడ్ చేసి ఈ నీరుని సగం అయ్యేవరకు మరిగించాలి. వేసిన పదార్థాలను ఆయుర్వేదపరంగా మన శరీరంలోని వైరస్  కానీ ఫ్లూ వంటి లక్షణాలు నిర్మూలించడానికి అద్భుతంగా పనిచేస్తాయి.త్వరగానే ఫలితం కనిపిస్తుంది.  

నీళ్ళుమరిగాక స్టవ్ ఆపేసి మీరు ఒక గ్లాసులోకి తీసుకోవాలి లేకపోతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి.చల్లారాక మాత్రం తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి అంటే మీరు ఇలా మూడు గ్లాసులు చేసుకోండి. ఉదయాన్నే ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, అలాగే సాయంత్రం ఒక కప్పు.రోజు మూడు పూటలు తీసుకోండి.బెల్లం యాడ్ చేశాను కాబట్టి ఇది కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకుంటే చాలు మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం మాత్రమే కాకుండా జలుబు, దగ్గు , జ్వరం అనేది దాదాపుగా తగ్గిపోతుంది.

ఇలా వైరస్లు దొడి చేసినప్పుడు వెంటనే మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఆ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా గోరు వెచ్చని నీరు తీసుకోండి. వ్యాధులు రాకుండా చేస్తాయి.

అంతే కాదు మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి.ఆరోగ్యానికి మేలు చేసే వాటిని కూడా మన ఆహారంలో యాడ్ చేసుకుంటే మరీ మంచిది జలుబు, దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఒకసారి ఈ రెమిడీని ట్రై చేసి చూడండి.

1 thought on “భయంకరమైన వైరస్తో వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి ని తగ్గించుకోండిలా..”

  1. కరోన వచ్చి తగ్గింది కాని అప్పుడప్పుడు శరీరము వేడి మరియు జ్వరము వచ్చినట్టు అనిపిస్తుంది

    Reply

Leave a Comment

error: Content is protected !!