covid positive fast recovery diet plan

Covid +VE నుండి Fast Recovery మరియు Immunity Boost కోసం తిరుగులేని Diet Plan

మీకు ఈ మధ్య కాలంలో కోవిడ్  పాజిటివ్ అని వచ్చిందా లేదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నారా. మీరు తినే ఫుడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ తో పోరాడే విధంగా ఉండాలి. సారంలేని భూమిలో విత్తనం మొలకెత్తన్నట్టే కరోనావైరస్ మన శరీరంలో అభివృద్ధి చెందలేదు. నాశనమైపోతుంది. ఆ డైట్ లైట్ గా ఉండి శరీరానికి పోషకాలు అందించే విధంగా ఉండాలి. శరీరం నీటిని పెంచడానికి ఊపిరితిత్తుల బలాన్ని పెంచగలగాలి. కరోనా నుంచి త్వరగా రికవరీ అవడానికి సహాయపడుతుంది. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని లేదా వేడి నీటిని తాగాలి. ఈ సమయంలో దగ్గు లేదా జలుబు చాలా ఎక్కువగా బాధపెడుతుంది. ఫ్రెష్ అయిన తర్వాత 15 నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయండి. డీప్ బ్రీతింగ్, కపాలబాతి, అనులోమ్ విలోమ్,  జలంధర్ బాద్, బస్రీనీ లంగ్స్ని బలంగా చేసి వాటి కెపాసిటీని పెంచుతాయి. కాటన్ దుస్తులు ధరించి బయట ఈ వ్యాయామం చేయడం వల్ల సూర్యరశ్మి కూడా తగులుతుంది. ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నట్లయితే వెల్లకితలా పదినిమిషాలు, పొట్ట మీద పది నిమిషాలు ఉండటంవల్ల సన్ లైట్ ని బాగా పొందవచ్చు. 

 వారంలో మూడు రోజులు తులసి కషాయం తాగాలి. స్టవ్పైన గిన్నె పెట్టి గ్లాసుడు నీళ్లు వేయాలి. అందులో కొన్ని పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, కొంచెం మిరియాల పొడి , చిన్న దాల్చిన చెక్క వేసి మరిగించాలి. పావువంతు అయ్యేంతవరకు మరిగించి తేనె లేదా బెల్లం పొడి కలిపి తాగవచ్చు. రెండు టీస్పూన్లు గిలాయ్ జ్యూస్ ని కొంచెం గోరువెచ్చని నీటితో తీసుకోండి. అందుబాటులో లేకపోతే ఉసిరి రసాన్ని తీసుకోండి. ఉదయాన్నే తాగిన తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. అల్పాహారం త్వరగా జీర్ణమయ్యేది, కడుపునిండుగా అనిపించేది తీసుకోవాలి. శెనగపిండికి జలుబు, దగ్గు తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. శెనగపిండి అల్పాహారంలో భాగంగా చేసుకోవడం వల్ల త్వరగా జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

నూనె కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు మొలకలు కూరగాయలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరానికి వేడి చేసే అల్లం నల్ల మిరియాలు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఆవు నెయ్యి తప్ప మిగతా పాల పదార్థాలు ఆహారం నుంచి దూరం పెట్టండి. త్వరగా ఆహారం జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. ఏదైనా తిన్నా గంట లేదా గంటన్నరలోపు వేడి నీటిని తాగాలి. దాహం ఎక్కువగా ఉంటుంది.  నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందడంతో పాటు దాహం కూడా తీరుతుంది. భోజనానికి భోజనానికి మధ్య ఆకలిగా అనిపిస్తే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అందుబాటులో ఉంటే దానిమ్మకూడా తీసుకోవచ్చు. అది రక్తకణాలను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. వాటర్ మిలన్, బనానా, చెరుకు రసం వంటివి శరీరానికి చలవ చేస్తాయి కనుక ఈ సమయంలో తీసుకోకపోవడం మంచిది.

 అప్పుడప్పుడు కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. గోధుమ పిండి ,శనగపిండి వంటివి మధ్యాహ్నం ఆహారంలో భాగం చేసుకోవాలి. త్వరగా జీర్ణం అవ్వడం తో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. సొరకాయ, ఆనపకాయ, బీరకాయ, బీట్ రూట్, గుమ్మడికాయ, క్యాప్సికం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరలు, కాకరకాయ కూడా తీసుకోవడం మంచిది. మినప్పప్పు, కిడ్నీ బీన్స్ తప్పించి అన్ని రకాల పప్పులు తినవచ్చు. మినప్పప్పు, కిడ్నీ బీన్స్ త్వరగా జీర్ణం కావు కనుక వాటిని దూరం పెట్టాలి. ఆహారాన్ని అప్పుడప్పుడు మార్చడం వల్ల శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందడంతో పాటు మనకి ఆహారం మీద విరక్తి రాకుండా ఉంటుంది. బంగాళాదుంప, కంద, సోయా బీన్ వంటివి తీసుకోకూడదు. 

భోజనం చేసిన గంట తర్వాత మళ్లీ వేడి నీళ్లు తాగాలి. ఒక కప్పు పుదీనా, అల్లం టీ తో నాలుగు ఖర్జూరాలు లేదా ఉప్పు సెనగలు లేదా వేయించిన శెనగపప్పు తినడం మంచిది. సెనగలు ఉడికించి తినొచ్చు. సాయంత్రం సమయంలో డైజేషన్ అనేది తగ్గిపోతుంది కోవిడ్ 

లక్షణాలు పెరుగుతాయి కనుక  తక్కువగా తినాలి త్వరగా జీర్ణమయ్యేవి తినాలి. ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. వెజిటేబుల్ కిచిడి, దలియాలాంటివి తీసుకోవాలి. 

ఈ సమయంలో చలవ చేసే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, సలాడ్, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం దూరం పెట్టాలి. ఎందుకంటే శరీరానికి చలువ చేసి జలుబు ని మరింత తీవ్రం చేస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పసుపు వేసిన పాలు తీసుకోండి. మంచిగా నిద్ర పోండి. ఎక్కువగా మాంసాహారం, రిఫైన్డ్ షుగర్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్ , ఫ్రైలు ఎక్కువగా తినడం వలన ఇమ్యూనిటీ తగ్గి వైరస్ విజృంభిస్తుంది. ఇవన్నీ శరీరానికి శక్తిని ఇస్తూ బయటకు వెళ్లకుండా  శరీరాన్ని దృఢంగా తయారు చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!