cracked heels causes home remedies

పాదమంత ఆరోగ్యం….. ఇలా పదిలం

అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు చెంగున తిరుగుతూ సందడి చేస్తుంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంటుంది. అయితే  ఇప్పటి కాలంలో అందర్నీ వేదిస్తున్న సమస్య పాదాల పగుళ్లు. ఒకప్పుడు వయసైన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పట్లో టీనేజ్ నుండే మొదలవుతోంది. మగవాళ్ళలో కూడా ఈ సమస్య ఉన్నా దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడేది మాత్రం ఆడవాళ్లే. వ్యాపారసంస్థలు కూడా ఈసమస్యను కాష్ చేసుకుంటూ ఎన్నో ఉత్పత్తులు తీసుకొచ్చినా సరైన పలితం అనేది ఉండటం లేదు. అయితే ఇంట్లో దొరికే వస్తువులతోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల కాలిపగుళ్లు తొందరగా తగ్గించుకోవచ్చు. అవి తెలుసుకునే ముందు కాలిపగుళ్లు రావడానికి కారణాలు కూడా ఒకసారి చూద్దాం.

కాలి పగుళ్లు రావడానికి కారణాలు

◆మొదటి కారణం అధిక వేడి. తినే పదార్థాలు వేడి చేసే స్వభావం ఉన్నట్లయితే శరీరం అధిక వేడికి గురవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గి చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. 

◆ఉద్యోగరీత్యా ఎక్కువగా సాక్సులు వాటి మీద షూస్ ధరించడం. దీనివల్ల పాదాల్లో చెమట ఊరి అది బాక్టీరియా గా మారే అవకాశం ఉంటుంది. చెమటతో తడిసిపోయిన పాదాలు తొందరగా పగుళ్లకు లోనవుతాయి.

◆దుమ్ము ధూళి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాడినా పాదాలను శుభ్రం చేసుకోకపోవడం వల్ల పగుళ్లు సంభవిస్తాయి.

◆వర్షాకాలం తో మొదలై శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ పాదాలు పగుళ్లకు గురి కావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

చిట్కాలు

◆పాదాలకు విశ్రాంతి ఉన్న సమయంలో వాటిని సెదతీర్చడం ఉత్తమం. మొదటగా కాళ్ళకు సాక్సులు, షూ లాంటివి ఎక్కువ సేపు ఉంచడం మానుకోవాలి. 

◆ప్రతిరోజూ రాత్రి పూట పడుకునేముందు కాళ్ళను కడుక్కుని పొడి బట్టతో తుడుచుకుని, కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె లేక పెట్రోలియం జెల్లీ రాయాలి. దీనివల్ల పాదాలు తొందరగా పగుళ్లు నుండి కొలుకుంటాయి

◆చలికి గురవ్వకుండా రాత్రిపూట పాదాలను శుభ్రమైన సాక్స్ వేసుకుని పడుకోవడం ఉత్తమం. దీనివల్ల పొడిబారకుండా ఉంటాయి.

◆నిమ్మరసం చాలా  చక్కగా పని చేస్తుంది. నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్లతో వేసి ఆ నీళ్లలో పాదాలను అయిదు నుండీ పది నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల పగుళ్లు ద్వారా చచ్చిపోయిన చర్మం మెత్తబడి ఊడిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్యూటీ పార్లర్ లో చేసుకునే పెడిక్యూర్ ఇంట్లో సులువుగా ఫాలో అవ్వడం అన్నమాట.

◆గోరింటాకులో వేడిని లాగేసే గుణం ఉంటుంది కాబట్టి కనీసం నెలకు ఒకసారి అయినా ఆకును రుబ్బి పాదాలకు పెడుతుంటే పాదాలు ఆరోగ్యకరంగా ఉంటాయి.

◆పచ్చి కొబ్బరి చిప్పలో గుప్పెడు బియ్యం వేసి దాన్ని అలాగే పది రోజులు వదిలెయ్యాలి. బియ్యం కొబ్బర బాగా కుళ్ళిపోయి ఉంటాయి. ఈ రెండింటిని బాగా మెత్తగా నూరి పాదాలకు అప్లై చేసుకోవాలి. చాలా తొందరగా ఎంత పెద్ద పగుళ్లు అయినా ఈ చిట్కాతో తగ్గిపోతాయి. 

చివరగా…..

పాదాల పగుళ్లకు చిట్కాలు మాత్రమే కాకుండా మనం తీసుకునే జాగ్రత్తలు కూడా ముఖ్యమైనవే. ఎప్పటికప్పుడు తడిపాదాలను పొడి బట్టతో తుడుచుకుని కనీసం కొబ్బరి నూనె లేక పెట్రోలియం జెల్లీ లాంటివి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే పాదమంత ఆరోగ్యం మీసొంతమైనట్టే

1 thought on “పాదమంత ఆరోగ్యం….. ఇలా పదిలం”

Leave a Comment

error: Content is protected !!