హలో ఫ్రెండ్స్ సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి కాలి మడమలు పగిలిపోయి ఈ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో పగుళ్ళు కు సంబంధించిన నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు చాలా ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తాయి. వీటి నివారణకు చాలామంది అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు కనుక ఫాలో అయితే మీ కాళ్ళ పగుళ్లు శాశ్వతంగా తగ్గిపోతాయి. పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.
ఈ చిట్కా కోసం ముందుగా ఒక క్యాండిల్ కొవ్వొత్తిని తీసుకొని గ్రేటర్ సహాయంతో మీకు కావలసినంత తురుముకోవాలి. ఇలా తురుముకున్న కొవ్వొత్తి మైనాన్ని రెండు స్పూన్ల మోతాదులో ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఇప్పుడు ఒక స్పూను ఆవనూనెను వేసి బాగా కలపండి. ఆవనూనె కాళ్ళ పగుళ్ళకు బాగా పనిచేస్తుంది . ఆవనూనెలో మైనం కరగటానికి డబుల్ బాయిలింగ్ పద్ధతిని ఉపయోగించాలి. మరుగుతున్న నీటిలో ఈ బౌలి ఉంచితే మైనం కరుగుతుంది.
కాళ్లు పగలడానికి ముఖ్య కారణం మీరు కాళ్లు సరిగా శుభ్రం చేసుకోలేకపోవడం మరియు శరీరంలో అవసరమైన నీరు లేకపోయినా డీహైడ్రేషన్ వల్ల పాదాలు పగులుతూ ఉంటాయి. కావున మీరు ప్రతి రోజు నీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ పగుళ్ల సమస్యలు మీరు నివారించుకోవచ్చు.
ఈ నూనె చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరచుకోవాలి. మీరు రాత్రి పడుకునే ముందు కాళ్లను శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని పగుళ్లపై అప్లై చేసుకొని ఒకటి నుండి రెండు నిమిషాలు బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత సాక్స్ తొడుక్కుని నిద్ర పోతే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మీ కాళ్ళ పగుళ్లు నయమవుతాయి.