cucumber health hacks for beginners

సెలబ్రిటీస్ వర్షాకాలంలో కూడా వీటిని తినడం ఆపరు….. వారి ఆరోగ్య రహస్యం…

వేసవికాలంలో కీర దోసకాయలను తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇది చలువ చేస్తుంది అని, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అని, దాహం తీరుస్తుంది అని, పొట్టకి హాయిగా ఉంటుందని ఇలాంటి కారణాలతో వేసవికాలంలో వీటిని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే ఆ సీజన్లో వాడి మిగతా కాలంలో వాడరు. ఎందుకంటే ఇవి చలువ చేసి జలుబు చేస్తుందని ఉపయోగించారు. ఏ కాలమైనాప్పటికీ అంటే అది చలికాలం అయినా, వర్షాకాలమైన కాలానికి సంబంధం లేకుండా కీరా దోసకాయను తినడం అనేది ఈరోజుల్లో చాలా మంచిది.

               ఎందుకంటే అందరికీ ఒబేసిటీ, షుగర్ వంటి సమస్యలే కాకుండా ఇందులో క్యాలరీస్ తక్కువ ఉండడం వలన అందరూ ఎక్కువగా తింటూ పొట్టను కీరదోసకాయలతో ఫిల్ చేస్తూ ఉంటారు. దానికి ఒక రకంగా లాభమే. కానీ వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది, కెమికల్ పొల్యూషన్ పెరిగిపోతోంది, అల్ట్రా వైలేట్ రెస్ మన చర్మాన్ని ఇరీటెట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి దోషాల నుంచి వాటి నుంచి విడుదలయ్యె చర్మం లో ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి కీరా దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది అని సైంటిఫిక్ గా 2013లో జర్మనీ వారు దీనిపైన పర్టిక్యులర్గా రీసెర్చ్ చేశారు.

                      అంటే కీరదోసలో క్యాలరీస్ తక్కువ. ఉదాహరణకు 100 గ్రా ముక్కలు తీసుకుంటే 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇంతకంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇందులో 96% నీరు ఉంటుంది. కానీ వీటిని ఒబేసిటీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, వేడి చేసిన వారు మాత్రమే తినాలి అని కాకుండా మనందరం బాహ్యంగా ప్రకృతిలో ఎండకు, పొల్యూషన్ కు, కెమికల్ కు ఎక్స్పోజ్ అవుతున్నాము. కాబట్టి అందులో ఉండే తక్కువ మోతాదులో ఫ్రీ రాడికల్స్ మరియు ఇతర రకాలు లేకపోయినప్పటికీ యు వీ రెస్ వాళ్ల జరిగేదాన్ని శరీరంలో మెటాబాలీజంలో వచ్చే మార్పుల వల్ల రిలీజ్ అయ్యే కొన్ని ఫ్రీ రాడికల్స్ ను చక్కగా ఈ హీట్ నుంచి న్యూట్రలైజ్ చేసి ఫ్రీ రాడికల్స్ ను  నిర్మూలించి రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది.

                        వీటిని పొట్ట ఫీలింగ్ కు ఉపయోగిస్తారు కానీ ఇటువంటి లాభాలు ఉంటాయని తెలిస్తే సంవత్సరం మొత్తం వాడతారని తెలియజేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించి మంచి లాభాలు పొందవచ్చు…

Leave a Comment

error: Content is protected !!