ప్రస్తుతం మారుతున్న జీవన శైలి వల్ల ప్రతి ఒక్కరూ డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్ చిన్న పెద్ద వయస్సులో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తుంది. ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. మందులు ఉపయోగిస్తూ సరైన ఆహార నియమాలు పాటించి నట్లయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల కొంతమందిలో నరాల వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మనం తయారు చేసుకునే జ్యూస్ ప్రతిరోజు మర్చిపోకుండా తాగడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. దీనితోపాటు షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉండడం కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. షుగర్ వ్యాధి ఉన్నవారు వారంలో రెండు లేదా మూడు సార్లు చేపలను తినడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి గుండె రక్తనాళాలను కూడా శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎక్కువగా పప్పు దినుసులను ఉపయోగించాలి.
పప్పు దినుసులను ఎక్కువగా ఉపయోగించడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. మాంసాహారం కంటే పప్పుదినుసులు ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. వ్యాధి ఉన్నవాళ్లు గోధుమ , రాగి తప్ప వరి ధాన్యాలు తినకూడదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, రాగి, గోధుమ అన్నింటిలోను 70% పిండి పదార్థాలు ఉంటాయి. ఏ ధాన్యాలు తిన్నాము అన్నది కాకుండా ఎంత మోతాదులో తీసుకున్నాము అది ముఖ్యం. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మొలకలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
టేస్ట్గా ఎక్కువ పోషకాలు ఉండే స్నాక్స్ కోసం చూస్తున్నారా అయితే ప్రతిరోజు బాదం పప్పులను తీసుకోవడం చాలా మంచిది. మీరు పనిచేసే చోట బాదంపప్పులను తీసుకుని మధ్య మధ్యలో తింటూ ఉండడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఓట్స్ కూడా షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా మంచిది. వీటితో పాటు ప్రతి రోజు వ్యాయామం చేయాలి. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఆహారం, వ్యాయామంతో పాటు షుగర్ కంట్రోల్ ఉండడం కోసం వైద్యులు సూచించిన మందులు ఉపయోగించడం కూడా తప్పనిసరి.
కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. మొటిమలు, గర్భ ధారణ సమయంలో వచ్చే సమస్యలు, అనేక చర్మ సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయలను తురుముకుని జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గ్లాసు నీళ్ళు వేసి పది కరివేపాకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడ కట్టుకొని షుగర్ ఉన్న వారు రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. సమస్య ఉన్నవారు పరగడుపున తీసుకోకూడదు. టిఫిన్ చేసి అరగంట తర్వాత తాగాలి.