Cure joint pains with methi or fenugreek

కకీళ్ళనుండి కట్ కట్ మని శబ్దం వస్తుంటే వెంటనే ఈ మూడు పదార్థాలు తినడం ప్రారంభించండి

మోకాళ్లలో నొప్పులు, జాయింట్స్ మధ్యలో కట్కట్మని శబ్దం వచ్చేవారు ప్రారంభంలోనే జాగ్రత్తలు తీసుకుంటుంటే తీవ్రమైన జాయింట్ పెయిన్స్, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేసే కొద్దీ అవి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. శరీరంలో వాయు దోషాలు ఉన్నప్పుడు మోకాళ్లలో గుజ్జు అనేది అరిగిపోయి మోకాళ్ళ మధ్య శబ్దం వస్తుంది. అలాగే ఎక్కువగా నిల్చుని పనిచేసేవారు, ఎక్కువగా పనివలన నడిచేవారు, బరువులు మోసేవారు ఇలాంటి సమస్యలకు గురవుతుంటారు.

 వీటిని మొదట్లోనే తగ్గించుకోవడం వల్ల ఆపరేషన్లు, మోకాళ్ళ చిప్పల మార్పిడి వంటి తీవ్ర సమస్యలకు గురికాకుండా జాగ్రత్తపడవచ్చు. దాని కోసం మనం ఆహారంలో భాగం చేసుకోవడం వలన లోపలినుండి సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ప్రారంభదశలో ఉన్నవారు రోజు రాత్రి ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెంతులను నమిలి తినేసి నీటిని తాగేయాలి.

ఇలా రోజూ చేయడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మోకాళ్ళ మధ్య గుజ్జు పెరుగుదలను గమనించవచ్చు. అలాగే పాలల్లో పసుపు వేసుకొని తాగడం వలన కూడా జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది. ఇది ఎముకల మధ్య నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. పాలు శరీరానికి కావల్సిన క్యాల్షియంని పూర్తిగా అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో అరస్పూన్ పసుపు కలిపి తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు.

 తరువాత చిట్కా వేయించిన శనగలు మరియు నల్ల బెల్లం. రోజు గుప్పెడు వేయించిన శనగలు, నిమ్మకాయంత నల్ల బెల్లం తీసుకోవడం వలన శరీరంలో ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా లభించి జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి. ఇవి ప్రతి రోజూ ఇలా తినడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎముకలు మధ్యలో గుజ్జు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు తరుచూ తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు సమస్యను జీవితంలో రాకుండా అడ్డుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!