Dangerous Disease Prevention Tips for Cancer

ఇవి ప్రాణాంతకమైన క్యాన్సర్ కు కారకమైన కారకాలు…….

 క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ క్యాన్సర్ రావడానికి మనం తినే ఆహారాలలో ఏవేవి క్యాన్సర్ ప్రేరకాలుగా ఉన్నాయి అంటే, మొట్టమొదటి ఆహారం ప్యాకిడ్ ఫుడ్. ఈ రోజుల్లో చిన్నపిల్లలు  దగ్గర నుండి పెద్దవారు దాకా అందరూ వీటిని చాలా బాగా తింటున్నారు. ఈ ప్యాకెట్ ఫుడ్స్ లో మైదా ఎక్కువ వాడతారు. వైట్ షుగర్ కూడా ఎక్కువగా వాడతారు. అలాగే దీంతోపాటు కాన్ ఫ్లోర్ అనేది కూడా ఎక్కువగా వాడతారు. వీటిలో నూనె అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నిటిని కూడా కలర్స్,  ఫ్లేవర్స్ అనే వాటిని ఎక్కువగా కలుపుతున్నారు.

            వీటిలో ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా హై ఫ్యాట్, హై కార్డ్స్ ఉండడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల మన శరీరంలో ఉండే DNA అనేది డామేజ్ అవుతుంది. ఈ ప్యాడ్ ఫుడ్ తినడం వల్ల పోషకాలు రావట్లేదు. కానీ క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. ఇక రెండవది నూనెలో దేవిన ఆహారాలు. అవేమిటి అంటే డీప్ ఫ్రై చేసినవి, వేపుళ్ళు, కూరలు లాంటివి. ఎక్కువ  హేట్ కి గురైనవి కూడా వీటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారం ద్వారా లోపలికి వెళ్లి మన శరీరంలో కణజాలాన్ని DNA ని డామేజ్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ తెల్ల రక్త కణాల మీద దాడి చేసి వాటిని బలహీనం చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి.

              ఇక మూడవది హై సాల్ట్ ఫుడ్స్ తినడం. ఎక్కువ ఉండే నిలవ పచ్చళ్ళు, పులుసులు, రసము ఇలాంటి సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ద్వారా ఈ సాల్ట్ ఎక్కువగా శరీరం లోకి వెళ్లడం వల్ల స్ట్రెస్ ని ఎక్కువగా పెంచుతుంది. ఇక నాలుగవది లో మైక్రో న్యూట్రియన్స్ ఫుడ్ తినడం. అంటే ఆహారాల్లో పోషకాలు లేని విధంగా తయారు చేసుకొని తినడం. కూరగాయలను నున్నగా చెక్కుకొని వండుకోవడం వల్ల సూక్ష్మమైన పోషకాలు తొక్కల్లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ పోతాయి కట్ చేసి ఫ్రిజ్లో రెండు మూడు రోజులు పెట్టి వండుకోవడం ఇవన్నీ సూక్ష్మమైన పోషకాలను పోయే విధంగా చేస్తాయి.

             ఆల్కహాల్ కూడా ఎక్కువ క్యాన్సర్ ప్రేరకమని చెప్పొచ్చు.

Leave a Comment

error: Content is protected !!