dark circles removal home remedy with potato

40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

ముఖసౌందర్యం పెంచుకోవాలని అందరిలోనూ మెరిసిపోవాలని తపించిపోతారు. కానీ తినే ఆహారం, ఒత్తిడి, కెమికల్స్ తో నిండిన సౌందర్యోత్పత్తులు ముఖాన్ని మచ్చలు, మొటిమలతో నింపేస్తాయి. అంతేకాకుండా పెరుగుతున్న వయసు తెచ్చిన ముడతలు అసలు కంటే ఇంకా పెద్దవారిగా చూపిస్తుంది. వేలకు వేలు పోసి పార్లర్ ట్రీట్మెంట్లు చేయించుకునేకంటే ఇంట్లో ఉండే పదార్థాలతో సహజంగా ముఖాన్ని మెరిపించవచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో ఎంతటి నల్లటి ముఖాన్నైనా తెల్లగా మార్చుకోవచ్చు. మచ్చలు, ముడతలు లేకుండా కాంతివంతంగా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం మనం మూడు పదార్థాలు మాత్రమే వాడుతున్నాం. వాటిలో ముఖ్యమైనది బంగాళదుంప. ఇవి మనకి సులభంగానే అందుబాటులో ఉంటాయి. కొంచెం సమయాన్ని కేటాయించి చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ముందుగా బంగాళాదుంప ఉడికించి తోలుతీసి మెత్తని పేస్ట్లా చేయాలి. ఉప్పు లేకుండా ఉడికించాలి. బంగాళాదుంప లో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, చర్మరంగును కాంతివంతంగా మార్చుతాయి. కళ్ళకింద చర్మాన్ని కాపాడి కళ్ళకింద వలయాలు రాకుండా చేస్తాయి. నల్లగా కమిలినట్టు మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ముడతలు, మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా చర్మం మీద ఉన్న జిడ్డును తొలగిస్తుంది. నల్లని మచ్చలు తొలగడానికి నాచురల్ టోనర్లా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా చేసి తేమగా ఉంచుతుంది. మెత్తగా మెదిపిన బంగాళాదుంపలో అరచెక్క నిమ్మరసం పిండాలి. 

నిమ్మలో ఉండే కొన్ని ఏజెంట్లు చర్మాన్ని టైట్గా చేస్తాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి ప్రీరాడికల్స్తో పోరాడుతుంది. చర్మంపైన మలినాలను, నలుపును పోగొడుతుంది. ఒక స్పూన్ ఆర్గానిక్ తేనె తీసుకోండి. తేనెలోని సహజసిద్ధమైన ఔషధగుణాలు చర్మసౌందర్యానికి సహాయపడతాయి. చర్మంపైన సహజ టోనర్గా పనిచేసి చర్మాన్ని తేమగా మార్చుతుంది. చర్మం పొడిగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మూడు బాగా కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదునిమిషాలు మర్దనా చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం ప్రకాశవంతమైన ముఖం మీ సొంతం. ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. బయటకు వెళ్ళేపుడు సన్ స్క్రీన్ లోషన్ రాయాలి.

Leave a Comment

error: Content is protected !!