చాలామందికి పెదాలు గులాబి రంగు కాకుండా నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. కొంతమందికి పై పెదవి నల్లగా అయిపోతుంది. కొంతమందికి కింద పెదవి నల్లగా అయిపోతుంది. కొంతమందికి పెదవుల చుట్టూ భాగం నలుపు రంగులో మధ్యలో గులాబి రంగులో ఉంటాయి. లేదా పెదవులకి అటు ఇటు నలుపురంగులో మధ్యలో గులాబి రంగులో ఉంటాయి. ఇలా నలుపు రంగులోకి మారి పోవడాన్ని పిగ్మెంటేషన్ అంటారు.
పిగ్మెంటేషన్ ను తగ్గించి పెదవులను హైడ్రేట్ గా నుంచి నలుపు రంగు గులాబి రంగులోకి మారే లాగా చేయడానికి కేవలం ఐదు రూపాయలు సరిపోతాయి. మీరు దీని కోసం వేలకు వేలు పెట్టి క్రీములు కొనాల్సిన అవసరం లేదు. ఐదు రూపాయలు పెట్టి ఐదు నిమిషాల్లో ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మీ పెదాలు గులాబి రంగులోకి వస్తాయి. దీనికోసం ముందుగా వాసెలిన్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా వాసెలిన్ , ఒక చెంచా కాఫీ పౌడర్, ఒక చెంచా పంచదార వేసుకొని బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి.
ఇది ఒక సారి తయారు చేసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టక పోయినా సరే నిల్వ ఉంటుంది. దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు పెదవులకు అప్లై చేసి బ్రష్ వెనుక భాగంలో టంగ్ క్లీనర్స్ ఉంటాయి. దానితో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ మరియు షుగర్ పెదవులపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. వాసెలిన్ పెదవులు ఆరిపోకుండా హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
తర్వాత లిప్స్ కోసం పాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో ఒక చెంచా పసుపు వేసుకొని, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను వారానికి ఒకసారి పెదవులకు అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. పసుపు, నిమ్మరసం పెదవులు హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. తర్వాత పెదవుల కోసం లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా వాసెలిన్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కాలేజీ లేదా హాస్టల్ కి వెళ్లే వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు తయారుచేసుకుని బాక్స్లో పెట్టుకొని ప్రతి రోజు రోజుకు రెండు సార్లు అప్లై చేయడం వల్ల పెదాలు హైడ్రేట్గా ఉండి గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కాతో నల్లగా ఉన్న పెదవులు కూడా గులాబీ రంగులోకి మారతాయి.