బయట ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లేవారిలో ఎండలకు చర్మ కణాలు దెబ్బతిని నల్లటి టాన్ చర్మంపై పేరుకు పోతుంది. ఎండలోకి వెళ్లినప్పుడు ఎండ నుండి రక్షించడానికి మన శరీరం మెలనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది సూర్య కిరణాలు చర్మంలోకి చొచ్చుకు పోకుండా కాపాడుతుంది. ఎప్పటికప్పుడు పై చర్మకణాలు చనిపోయి తొలగిపోతుండడం వల్ల నల్లదనం మళ్ళీ కొన్ని రోజులకు అసలైన చర్మ రంగు బయటకు వస్తుంది. కానీ కొంత మందిలో మృత కణాలు తొలగిపోవడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది.
దానివలన పై చర్మం దెబ్బతిన్నట్లు నల్లగా అక్కడ, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఒక చిట్కా మృత కణాలను తొలగించి చాలా బాగా పనిచేస్తుంది. ఆ చిట్కా కోసం అన్ని సహజమైన పదార్థాలనే మనం తీసుకోబోతున్నాం. ఇప్పుడు 2 నాటు రకం టమాటాలను మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో అర చెక్క నిమ్మరసం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఎక్కడైతే నల్లటి చర్మం ఉందో అక్కడ ప్యాక్ లా వేసుకోవాలి.
అరగంట తర్వాత దీనిని నీటితో కడిగేయాలి. టమాటా పేస్ట్ చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి, నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మానికి మంచి రంగు ఇవ్వడంలో, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రం చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. కావాలంటే టమాటా పేస్ట్ కడిగిన తర్వాత అలా వదిలేయొచ్చు లేదా సున్నిపిండితో స్నానం చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి మీ శరీర రంగుని మెరిపిస్తుంది.
వీటితో పాటు ప్రతిరోజూ మూడున్నర నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వలన చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించడంలో చెమట రూపంలో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానితోపాటు ఉదయాన్నే ఒక క్యారెట్, బీట్రూట్, కీరా, సొరకాయ కలిపి చేసిన జ్యూస్ను వడకట్టి ఒక గ్లాస్ తాగడం వలన కూడా శరీరంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి మంచి రంగు వస్తారు. ఈ జ్యూస్ రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ అందిస్తుంది.