day and night moisturizing cream

డే అండ్ నైట్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు…… స్కిన్ పగలదు మరియు పొడిబారదు… చర్మం మృదువుగా తయారవుతుంది……..

శీతాకాలంలో ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి మన చర్మం పొడిబారిపోవడం, పగలడం జరుగుతుంది. దీనివలన చర్మం చాలా రఫ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే డే అండ్ నైట్ మాయిశ్చరైజర్ క్రీమ్ వీటి నుంచి విడుదల అందించడమే కాకుండా మన చర్మం ను చాలా మృదువుగా చేస్తుంది. దీనికోసం ఉపయోగించేవి అన్ని మనకు ఇంట్లో లభించేవి కనుక వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల ఈ క్రీమ్ ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ఈ రెమిడి చాలా బాగా వర్క్ అవుతుంది.

                        ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అయిన తీసుకోవచ్చు లేదా మార్కెట్లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగించడం వలన ఇది మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పని చేయడంతో పాటు ఏమైనా స్కిన్ రసేస్ ఉంటే తగ్గుతాయి. తరువాత ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమపువ్వు వేసుకోవడం వల్ల అది మన చర్మం కు మంచి గ్లోనెస్ ని ఇస్తుంది. 

                   తర్వాత ఒక స్పూన్ గ్లిజరిన్ లేదా బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని బాగా కలుపుకుంటే క్రీమ్ మంచి గోల్డెస్ కలర్ లో వస్తుంది. ఈ క్రీమ్ నైట్ క్రీమ్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు డే క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం తయారు చేసుకున్న నైట్ క్రీమ్ లో ఒక స్పూన్ ఏదైనా మనం ఉపయోగించే కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ కలపడం వలన క్రీమ్ కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ను ఒక గాజు డబ్బాలో తీసుకోవాలి. ఈ క్రీమ్ డే టైం లో బాగా ఉపయోగించుకోవచ్చు.

                  ఈ క్రీమ్ ను ఉపయోగించే ముందు ఫేస్ నీట్ గా కడుక్కొని క్రీం బాగా అప్లై చేసుకోని ఐదు నిమిషాల పాటు బాగా రబ్ చేయాలి. ఇలా రోజు చేయడం ద్వారా మన చర్మం పొడిబారకుండా ఉండి మంచి మాయిశ్చరైజర్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మం చాలా మృదువుగా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!