శరీరంలో రక్తపోటు ప్రమాదకరంగా తగ్గిపోయినపుడు ప్రాణాపాయము జరిగేటంత “షాక్” వస్తుంది. ఎక్కువ నొప్పి కలగడం వల్ల, ఒళ్ళు బాగా కాలినపుడు, ప్రామాధాలలో ఎక్కువ రక్తం పోయినప్పుడు ప్రమాదకరమైన జబ్బులు వచ్చినపుడు, ఒంట్లో నుండి నీరు ఎక్కువగా పోయినప్పుడు, ఒళ్ళు డీహైడ్రేట్ కు గురైనప్పుడు ఇలా అనేక సందర్భాలలో “షాక్” వస్తుంది.
షాక్ రావడానికి ముందు లక్షణాలు
ప్రతి సమస్య రావడానికి ముందు కొన్ని సిగ్నల్స్ మన శరీరంలో కనిపిస్తుంటాయి. అలాగే షాక్ రావడానికి ముందు మన శరీరం నుండి కొన్ని సిగ్నల్స్ వస్తాయి వాటిని గమనించుకుని ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే సమస్యను తీవ్రంగా కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
◆ నిలబడలేక నీరసం రావడం, స్పృహ తప్పిపోవడం జరుగుతుంది.
◆ ఎలాంటి ఆహార ప్రభావం లేకపోయినా వాంతి వచ్చినట్టు అనిపించడం.
◆ రక్తపోటు పడిపోవడం వల్ల ఒళ్ళంతా చల్లబడిపోవడం. లేదా వాతావరణం చల్లగా ఉన్నా విపరీతమైన చెమటలు పట్టడం,
◆ అతి దాహం వేయడం. ఎన్ని నీళ్లు తాగినా ఇంకా తాగాలని అనిపించడం, నోరు తడిలేకుండా ఆరిపోతూ ఉండటం.
◆ తీవ్రమైన అలసట, అయోమయ స్థితి, గుండె వేగం నెమ్మదిగా కొట్టుకోవడం లేదా సాధారణం కంటే వేగంగా కొట్టుకోవడం. వంటి లక్షణాలు కనబడతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
◆ షాక్ వస్తుందన్న అనుమానం రావడంతోనే వ్యక్తిని పడుకోబెట్టాలి. కాళ్ళవైపు ఎత్తుగా ఉండేలా చూడాలి.
◆ తల ప్రదేశంలో ఏదైనా దెబ్బ తగలడం వల్ల షాక్ గురవడం జరిగితే కాళ్ళ కింద ఎత్తు పెట్టకూడదు. గల్గడకు వీపు ఆనెట్టుగా ఎటావాలుగా కూర్చోబెట్టాలి. దీనివల్ల రక్తస్రావం లాంటివి జరగకుండా ఉంటాయి.
◆ స్పృహలో ఉంటే గోరువెచ్చని నీటిని తాగించవచ్చు.
◆ గాలి, వెలుతురు ధారాళంగా తగిలేలా చూడాలి. ఎలాంటి భయానికి గురికాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ సదాదానంగా ఉంచవచ్చు. అదే భయం ఎక్కువైతే రక్తపోటు ఎక్కువ అవుతుంది.
◆ షాక్ కు గురైన వ్యక్తి చుట్టూ ఆందోళన చేసే వాళ్ళను వీలైనంతవరకు దూరంగా ఉంచాలి.
◆ వ్యక్తిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం ఉత్తమం. ఇటువంటి సందర్భాలలో సొంత వైద్యం పనికి రాదు. ముక్యంగా అవగాహన లేకుండా అసలు ఏ పని చేయకూడదు.
◆ పడిపోవడం వంటివి జరిగినపుడు శరీరానికి పైన దెబ్బ తగలకపోయినా లోపలి దెబ్బలు తగిలిఉండవచ్చు, ముఖ్యంగా తల ప్రాంతంలో దెబ్బలు తగలడం వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.
◆ వీలైనంతవరకు ఇటువంటి సమస్యలు ఇదివరకే ఎదుర్కొన్న వ్యక్తికి కోపం, చికాకు వంటివి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమస్య వరకు వెళ్లకుండా ఉండచ్చు
◆ ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్త అవసరం.
చివరగా…….
సాధారణంగా షాక్ కు గురి కావడం అనేది శారీరక బలహీనత మరియు, షుగర్, బిపి లాంటి సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా అవసరం అవుతుంది. రోజులో ప్రతి పనికి సమయవేళలు నిర్దేశించుకుని దానికి తగ్గట్టు అనుసరించడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.