మన శరీరంలో రక్తాన్ని ప్రతి అవయవానికి సరఫరా చేసేందుకు గుండె ఒక ట్యాంక్లా పనిచేస్తే, శరీరంలోని రక్తనాళాలు పైపుల్లా ఉపయోగపడతాయి. మనం తినే ఆహార పదార్థాలు కొవ్వు రక్తనాళాల్లో రక్తం సరఫరాకి అడ్డంగా ఏర్పడి రక్తసరఫరాను నెమ్మదిగా నిలిపివేస్తుంది. ఆహారం వలన రక్తంలో ఏర్పడిన మలినాలు, కొవ్వు ఇలా రక్తనాళాల్లో అడ్డుగా నిలవడం వల్ల రక్తం యొక్క ఒత్తిడి ఎక్కువయి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
గుండె వ్యాధులు ఉన్నవారు, అధిక బరువుతో బాధపడుతున్న వారు, డయాబెటిస్ వల్ల లేదా ఇతర అనారోగ్యాల వలన గుండె వ్యాధులు ప్రమాదం ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగడం వలన శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకుని అవయవాలను డీటాక్సిఫై చేయడం ద్వారా గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వలన రక్త సరఫరా ఆగిపోతే అది గుండె లివర్ సమస్యలు, మూత్రపిండాల్లో సమస్యలు, జుట్టు రాలే సమస్య వంటి వాటికి కారణం అవుతుంది. అందుకే మన ఇంట్లోనే ఉండే నాలుగు పదార్థాలతో జ్యూస్ చేసి తాగడం వలన శరీరాన్ని విశవ్యర్ధాల రహితంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనికోసం ఒక లేత సొరకాయ తీసుకోవాలి.
దానిని పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. దానితోపాటు గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, పది తులసి ఆకులతో తయారు చేసిన ఆరోగ్యకరమైన కూరగాయల రసం తీసుకోవాలి. పరగడుపున దీనిని తీసుకోవడం వలన ఇది మంచి డిటాక్స్ జ్యూస్ గా పనిచేస్తుంది. దీనిని మొదట ఉదయం లేచిన వెంటనే తాగాలి.
వేసవి కాలంలో సొరకాయ విరివిగా లభిస్తుంది. ఈ మధ్యకాలంలో అన్ని సీజన్స్ లో అందుబాటులో ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్నందున, వేసవి కాలంలో దీనిని తీసుకోవడం చాలా మంచిది.
ఈ జ్యూస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తీసుకుంటే దిగువ ప్రయోజనాలు శరీరంపై ప్రభావవంతంగా ఉంటాయి.
ఈ రసం మీ శరీరాన్ని శుభ్రపరచడానికి గొప్ప డిటాక్స్ జ్యూస్.
ఇందులో తక్కువ క్యాలరీలు మరియు కొవ్వు అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు బరువు తగ్గడానికి గొప్పగా ఉపయోగపడతాయి.
ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది మరియు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కరిగే మరియు కరగని ఫైబర్‌లు సులభంగా జీర్ణం కావడానికి మరియు మలబద్ధకాన్ని నివారిస్తాయి.
ఇది జుట్టు యొక్క అకాల తెలుపును నిరోధిస్తుంది.
ఈ రసం మీ రంగును మెరుగుపరుస్తుంది మరియు మెరిసే చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేసి అధిక కొవ్వు సమస్యను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు గడ్డలు కరిగించే రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న ఈ జ్యూస్ ను తయారుచేసుకొని వడకట్టి అరచెక్క నిమ్మరసంతో తాగవచ్చు. ఇలా ప్రతిరోజు ఉదయం తాగడం వలన అధిక బరువు సమస్య సులభంగా తగ్గించుకోవచ్చు.