బీపీ ఉన్నవారికి షుగర్ వస్తుంది షుగర్ ఉన్నవారికి బీపీ వస్తుంది. ఈ రెండిటిని జంట రోగాలు అంటారు.అలాగే వీటితో పాటు ఒబేసిటీ కూడా కొందరికి ఉంటుంది. షుగర్ ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి ఆహార నియమాలు వేరుగా ఉంటాయి.ఇప్పుడు మనం బీపీ షుగర్తో పాటు ఒబేసిటీ కూడా తగ్గించే డైట్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం లేవగానే కాఫీ టీలు తాగకుండా లీటర్ నర నీళ్లు తాగాలి. తాగిన కొద్దిసేపటికి మోషన్ అవుతుంది.
ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ లీటర్ నర నీళ్లు తాగాలి. రెండవసారి మోషన్ అవుతుంది. పొట్ట మరియు ప్రేగులు శుభ్రం ఐపోతాయి. తర్వాత 10.30 -11 గంటలకు వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఒక క్యారెట్, సొరకాయ, ఒక టమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, చిన్న బీట్ రూట్ ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని వడకట్టుకుని తాగాలి. టేస్ట్ కోసం కొంచెం తేనె, నిమ్మరసం వేసుకోవాలి. కాగితపు చప్పరిస్తూ తాగాలి. చప్పరిస్తూ తాగడం వల్ల ఎంజైమ్లు రిలీజయ్యి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
తర్వాత మధ్యాహ్నం భోజనంలో కొమ్ముశెనగలు, బొబ్బర్లు, రాజ్మా, సోయా గింజలు, పచ్చి బఠాణి 8-12 గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటిని నీటిలో నుండి తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో పచ్చి మిర్చి, కొంచెం మెంతికూర, పాలకూర, కొన్ని పచ్చి వేరుశెనగలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్రూట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు,కొన్ని కాప్సికం ముక్కలు, కొన్ని ఉల్లికాడ ముక్కలు వేసి 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. దీనిలో అవిసె గింజల పొడిని వేసుకుని లేదా నంచుకొని తినేయాలి.
టేస్ట్ కావాలంటే పైన లైట్ గా ఉప్పు లేదా చాట్ మసాలా జల్లుకోవచ్చు. లేదా పెరుగు చట్నీ వేసుకుని కూడా తినవచ్చు. సాయంత్రం నాలుగు 5 గంటల సమయంలో ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు లేదా బత్తాయి జ్యూస్ తాగాలి. భోజనంలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జామకాయలు వంటివి తీసుకోవాలి. పుచ్చ పప్పు, బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు, ఖర్జూరాలు వంటి 12 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి.
రాత్రి భోజన ఆరున్నర గంటలకు తినేయాలి. ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుతూ శరీరానికి వ్యాయామం చేస్తూ ఉంటే అధిక బరువు, ఒబేసిటి, బీపీ, షుగర్ వంటివి కంట్రోల్ లోకి వస్తాయి. డైట్ ప్లాన్ 20 రోజుల నుంచి 30 రోజుల లోపు వాడినట్లయితే షుగర్ టాబ్లెట్స్ డోసు కూడా తగ్గించుకోవచ్చు.