టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు సంవతరానికి ఒకసారి చేయించుకోవలసిన చెక్-అప్‌లు కొన్ని ఉన్నాయి. ఇవి మీ పరిస్థితి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.
ప్రతి 3 నెలలకు ఒకసారి చేయించుకోవలసిన పరీక్షలు
రక్తంలో చక్కెర తనిఖీలు (HbA1C పరీక్ష), ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ , గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్
మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిలను మరియు అవి సాధారణ స్థాయికి ఎంత దగ్గరగా ఉన్నాయో తనిఖీ చేస్తుంది.
మీరు కొత్తగా మధుమేహం నిర్ధారణ అయినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి, మీరు స్థిరంగా ఉన్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ తనిఖీలను కలిగి ఉంటారు.
సంవత్సరానికి ఒకసారి చేయించుకోవలసినవి
పాదాలు
మీరు మీ పాదాలలో ఏదైనా అనుభూతిని కోల్పోయారా అంటే ఎక్కువగా తిమ్మిరి రావడం మరియు అల్సర్లు మరియు ఇన్ఫెక్షన్ల కోసం తనిఖీ చేస్తారు.
మీ పాదాలలో కోతలు, గాయాలు లేదా తిమ్మిరి ఉంటే వెంటనే మీ GPతో మాట్లాడండి.
కళ్ళు
మీ కళ్లలో రక్తనాళాలు దెబ్బతినకుండా తనిఖీ చేస్తుంది.
మీకు అస్పష్టమైన దృష్టి , కంటిసమస్యలు ఉంటే వెంటనే మీ GPతో మాట్లాడండి.
రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు మూత్రపిండాలు
అధిక రక్తపోటు, గుండె మరియు మూత్రపిండాల వ్యాధులకు చెక్ పెడుతుంది.
ఇది మీ GP లేదా డయాబెటిస్ నర్సు ద్వారా చేయవచ్చు. HbA1c చెక్ – కాలక్రమేణా సగటు రక్త చక్కెర. HbA1c గత 8-12 వారాలలో సగటు రక్తంలో చక్కెర స్థాయిల గురించి పూర్తిగా తెలుపుతుంది.
రక్తపోటు తనిఖీ. రక్తపోటు ఉన్నవారు, లేనివారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి
రక్త లిపిడ్లను తనిఖీ చేస్తుంది. రక్తంలో కొవ్వుశాతాన్ని తెలిపే పరీక్ష
మూత్రపిండాల తనిఖీ. మూత్రపిండాల సమస్యలు డయాబెటిస్ రోగులలో అధికం. ఇది మూత్ర పిండాల సమస్యలు ఉన్నాయోమో తెలుపుతుంది.
ఇంజెక్షన్ సైట్ తనిఖీ (ఇన్సులిన్ థెరపీ కోసం)
దంత తనిఖీ. డయాబెటిస్ రోగులలో దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సంవత్సరానికి ఒకసారైనా పరీక్ష చేయించుకోవాలి.
ఈ సీ జీ. గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో తెలిపే పరీక్ష.
యూరిక్ యాసిడ్ టెస్ట్: ఇది రక్తంలో అధికంగా పెరగడం వలన గట్ అనే వ్యాధి బారినపడతారు.
ఈ పరీక్షలు తరచూ చేయించుకోవడం వలన అనేక వ్యాధుల బారిన పడకుండా ముందుగా జాగ్రత్త పడవచ్చు. వీటితో పాటు ఇంకా అనేక రకాల పరీక్షలు ఉన్నాయి. వీటిని డాక్టర్ సూచించినప్పుడు చేయించుకోవడం చాలా అవసరం.