ఆలస్యంగా జీర్ణమయ్యే కఠినమైన పదార్థాలను పదేపదే తినడం వల్ల,ముందు తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ ఆహారాన్ని తీసుకోవడం, విరుద్ధమైన ఆహార పదార్థాలు సేవించడం. అకాలబోజనం, అప్పటికే ఉన్న అజీర్ణమనే సమస్యకు తగ్గట్టు నూనె, మసాలా, తీపి వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోయి అతిసార విరేచనాలుగా మారుతుంది.
కాలానుగుణ మార్పులు పాటించకుండా రుచి కోసం ఋతువుకు సంబంధం లేని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కూడా అతిసారమనే సమస్య ఎదురవుతుంది.
ఈ అతిసారాన్ని తగ్గించే అద్భుతమైన చిట్కాలు
◆ రావి చెట్టు చిగుర్లు తెచ్చి రసం తీసి 5 నుండి 10 గ్రాముల మోతాదుగా ఆ రసాన్ని తీసుకుంటూ ఉంటే అతిసార విరేచనాలు తగ్గిపోతాయి.
◆ ఇరవై గ్రాముల పెరుగులో నలభై గ్రాముల అరటి పువ్వులు దంచిన రసం కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.
◆ పచ్చి కరివేపాకు తో పచ్చడి లేదా కరివేపాకును నేతిలో దోరగా వేయించి గానీ పూటకు అయిదు గ్రాములు తింటూ ఉంటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
◆ నీళ్ల విరేచనాలు ఇబ్బంది పెడుతున్నపుడు అప్పటికప్పుడు వేడివేడిగా తయారుచేసిన వేడి జిలేబీని తింటే తక్షణ ఫలితం ఉంటుంది.
◆ తంగేడు వేరు బెరడును తీసుకొచ్చి దంచి పది గ్రాముల మోతాదుగా పెరుగుతో కలిపి తీసుకుంటూ ఉంటే ఎలాంటి విరేచనాలు అయినా కట్టుకుంటాయి.
◆ రెండు లేక మూడు స్పూన్ల మిరియాలు కచ్చాపచ్చగా దంచి ఈ మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యిలో వేసి దోరగా వేయించి నిల్వచేసుకోవాలి. దీనిని బోజనం చేసేటపుడు మొదటి అన్నం ముద్దలో కలుపుకుని తింటూ ఉంటే రెండు లేక మూడు పూటల్లో విరేచనాలు తప్పక తగ్గిపోతాయి.
◆ బోజనం చెసేటపుడు మొదటి ముద్దలో నాలుగు చిటికెల శొంఠి చూర్ణం కలిపి అందులో 10 గ్రాముల అప్పుడే కాచిన వేడి నెయ్యి వేసుకుని బాగా కలిపి తినాలి. అందరికీ ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
◆ చింత చెట్టు బెరడు, కరక్కాయ బెరడు, శొంఠి, వాము, సైందవ లవణం అన్నిటినీ సమభాగలుగా తీసుకుని మెత్తగా దంచి, చూర్ణం చేసుకుని పూటకు 5 గ్రాముల మోతాదుగా రెండు పూటలా మజ్జిగలో కలుపుకుని తాగాలి. చాలా తొందరగా పలితాన్ని ఇస్తుంది ఈ ప్రక్రియ.
◆ మేడి చెట్టును కొన్నిప్రాంతాల్లో అత్థి చెట్టు అంటారు. ఈ మేడి ఆకులు 10 గ్రాముల మోతాదుగా తీసుకుని పావు లీటరు నీళ్లలో వేసి, సగం నీళ్లు మిగిలేలా కషాయాన్ని కాచి వడపోసి పూటకొక మోతాదుగా మూడు పూటలు సేవిస్తే, పిల్లలలో వేడి చేయడం వల్ల కలిగే విరేచనాలు మరియు పెద్దలలో అతిసార జిగట విరేచనాలు అన్ని తగ్గిపోతాయి. అయితే పిల్లలకు ఈ కషాయన్ని కొద్దీ మోతాదులో ఇవ్వాలి.
◆ నీటిని మరిగించి ఆ వేడి నీళ్లలో కాసింత నెయ్యి వేసి పూటకు ఒక కప్పు లేదా రెండు కప్పుల మోతాదులో నీళ్లను తాగుతూ ఉంటే విరేచనాలు సమస్య తగ్గుతుంది.
చివరగా…….
విరేచనాలు సమస్య ముఖ్యంగా ఆహారం వల్ల మరియు నీటి వల్ల వచ్చే సమస్య కాబట్టి ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ పైన చెప్పుకున్న ఆయుర్వేద చిట్కాలతో వేటిని పాటించినా సమస్యను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు.