కాలం తెచ్చే మార్పులు జీవితాల్లో ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. వస్త్రాధారణ నుండి ఆహారం వరకు గొప్ప మార్పు నేటి తరానిది. సాధారణ భోజనానికి అలవాటు పడిన భారతీయుల జీవితంలో అల్పాహారాలు మొదటగా ప్రవేశించాయి. తరువాత రాను రాను ఆహారం లో మార్పులు వస్తూ ఉన్నాయ్. ప్రస్తుతం చాలా మనది ఉదయాన్నే తీసుజకునే అల్పాహారం ఏమంటే బ్రెడ్, జామ్. లేకపోతే బ్రెడ్ శాండ్విచ్. జీవితాల్లో బ్రెడ్ ఒక భాగం అయిపోయింది. అయితే ఈ బ్రెడ్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు నోటికీ రుచిగా ఉంది కదా అని.
అయితే బ్రెడ్ తినడం కొన్ని రోజులు ఆపితే శరీరంలో జరిగే మార్పులు గూర్చి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవి మీకు తెలియకుంటే ఇదిగో ఇక్కడ ఇస్తున్నాం చదవండి మరి.
1. రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు నియంత్రించబడతాయి
బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు శుద్ధి చేయబడి ఉంటాయి. అంటే ఇవి శరీరానికి ఎలాంటి ఉపయోగకరం కాదు. దీని ఫలితంగా ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. బ్రెడ్ ను తీసుకోవడం ఆపితే డయాబెటిస్ మరియు గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
2. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం
బ్రెడ్ ను తీసుకోవడం వల్ల అందులోని చెక్కెరలు సల్ఫర్ తో నిండినవి. ఇవి కరగని చక్కెరలుగా రక్తంలో స్థిరపడిపోతూ ఉంటాయి. బ్రెడ్ ను అధికంగా తీసుకునేవారిలో ఈ స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి.అందుకే బ్రెడ్ ను వాడటం మానేస్తే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి
3. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది (ముఖ్యంగా పొట్ట భాగంలో )
బ్రెడ్ ఉబకాయం యొక్క ప్రధాన శత్రువు. ఎందుకంటే ఇది శరీరంలో గ్లూకోజ్ రూపంలో నిల్వ ఉంటుంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల భాగాలలో ఎక్కువ కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. వ్యాయామం చేస్తూ బ్రెడ్ తీసుకోవడం తగ్గిస్తే తప్పకుండా పేరుకుపోయిన కొవ్వు సులువుగా తగ్గించుకోవచ్చు.
4. గుండె బలపడుతుంది
పాల్మిటోలిక్ ఆమ్లం అని పిలువబడే కొవ్వు ఆమ్లం బ్రెడ్ లో ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకునేలా ప్రభావితం చేస్తుంది. అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వీటి పర్యవసానాలు గుండె జబ్బులు మరియు మధుమేహంతో బాధపడే ప్రమాదం ఉంది. అదే బ్రెడ్ ను తీసుకోవడం ఆపేయడం వల్ల గుండెను కాపాడుకున్నవాళ్ళం అవుతాము.
5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం నేరుగా మెదడు పనితీరుకును ప్రభావితం చేస్తుంది. గ్లైకోజెన్‌ను మితమైన పరిమాణంలో తీసుకోవడం మంచిది. దీని ద్వారా మెదడులో న్యూరాన్లను రక్షించుకోవచ్చు. కార్బోహైడ్రేట్లను అధికంగా తినేటప్పుడు ఇది మెదడును చాలా క్షీణించిపోయేలా చేస్తుంది. వీటిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర లేమి, జీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి.
చివరగా….
బ్రెడ్ తయారీలో మొదటగా పిండిని కాసింత పులియబెట్టడం అనే ప్రక్రియ తరువాత చేస్తారు కాబట్టి వాటిలో బాక్టీరియా ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మైదా తో తయారు చేసేది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.