రాత్రి 7 గంటల తరువాత భోజనం చేయడం మంచిది కాదని ఆయుర్వేదం ప్రకారం చెబుతుంటారు. కానీ ఇప్పటి కాలంలో ఉద్యోగరీత్యా ఆరు లోపల భోజనం చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఉద్యోగస్తులు తొమ్మిది దాటిన తర్వాతే అలసిపోయి ఇంటికి వస్తుంటారు.
కనీసం ఒక్క పూట అయినా కుటుంబంతో కలిసి భోజనం చేయాలని అనుకుంటారు. కానీ ఆరు తర్వాత తినకూడదు అంటే ఇలాంటి సమయంలో కష్టమౌతుంది. కానీ ఆలస్యంగా భోజనం చేయడం వలన వాళ్ళకి గ్యాస్, అజీర్తి, వికారం, ఎసిడిటీ సరైన నిద్ర లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
కొంతమంది ఉద్యోగస్తులకు ఇలాంటి నియమం ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఒకవేళ 6 తర్వాత భోజనం చేసినా ఆహారం బాగా జీర్ణం అయ్యేలా ఈ కొన్ని టిప్స్ సహాయం చేస్తాయి. ఇవి కూడా ఆయుర్వేదంలో సూచించినవే. వీలైనంత వరకు ఏడు గంటల లోపు భోజనం ముగించేలా చూసుకోండి. లేనిపక్షంలో వీలైనంత లైట్గా భోజనం చేయాలి.
తర్వాత వెంటనే పడుకోకుండా కనీసం కొంత సేపు నడవాలి. నడిచేందుకు వీలు లేనప్పుడు కనీసం వజ్రాసనం వేసి పదిహేను నిమిషాల పాటు ఉండాలి. భోజనానికి ముందు అల్లం తురుము, సైంధవ లవణం కలిపి బాగా నమలడం వలన కడుపులో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి.
ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా రెండు గంటల విరామం ఇవ్వాలి. తర్వాత విరామంగా కూర్చొని ఎడమ ఉంగరపు వేలుతో కుడి ముక్కును మూసి ఎడమవైపు గాలిని పీల్చుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తరువాత ఎడమ వైపు ముక్కు మూసి కుడివైపు గాలిని పీల్చుకోవాలి.
ఇలా కనీసం పది, పదిహేను సార్లు చేయడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి కావాల్సిన జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పడుకునేటప్పుడు ఎడమ వైపు పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు కుడివైపు శ్వాసక్రియ బాగా జరిగి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉద్యోగస్తులు ఈ సలహాలు పాటిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందండి