DIY Moisturizer For Face In Telugu Glossy Skin at home in Telugu

1000స్కిన్ క్రీం. పది రూపాయలకే. 3రోజుల్లో గ్లాసీ స్కిన్ మీ సొంతం

అందమైన చర్మం పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ఈ ప్యాక్ ను ప్రయత్నించి చూడండి. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. దాని కోసం మనం తీసుకునే పదార్ధాలు కూడా అందరికీ అందుబాటులో ఉండేవే కనుక మొదట వారం అంతా ఉపయోగించుకోవడానికి ఒక ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.

 దానికోసం ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కస్తూరీ పసుపు, పదిచుక్కల నిమ్మరసం కొద్దిగా రోజ్వాటర్లో కలిపి ముఖానికి ఫేసియల్ హెయిర్ ఎటుఉంటే అటు పైకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి కిందకి నలుపుతూ తీయడం వలన ఫేసియల్ హెయిర్ పోవడంతో పాటు మచ్చలు, నలుపుదనం తగ్గుతుంది.

మొటిమలు ఉన్నవారు ప్యాక్ను నలుపుతూ తీయకూడదు. పాక్ అప్లై చేసి నీటితో శుభ్రపరుచుకోవాలి. ముఖానికి స్క్రబ్ కోసం కాఫీ పొడి ఒక స్పూన్, పంచదార ఒక స్పూను, తేనె ఒక స్పూన్ కలిపి అందులో కొన్ని చుక్కల నీటిని కూడా కలుపుకొని దీనిని ముఖానికి స్క్రబ్లా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. ఇది ముఖం పై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడంతో పాటు ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేస్తుంది.

 తర్వాత రెండు స్పూన్ల బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి. రైస్ వాటర్ ను ఒక స్పూన్  తీసుకొని ఒక జార్ లో వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక విటమిన్ ఇ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం అన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల ఇది క్రీమ్ టెక్చర్లోకి వస్తాయి. ఈ క్రీమ్ని ప్రతిరోజూ పడుకునే ముందు, ఉదయం ముఖం శుభ్రం చేసుకున్న తరువాత అప్లై చేయాలి. ఇలా వారం అంతా నిల్వచేసుకుని వాడుకోవచ్చు. 

కనీసం వారంలో రెండు, మూడు సార్లు చర్మంపై శ్రద్ధ తీసుకుని చేయడం వల్ల మొఖం కాంతివంతంగా, మచ్చ రహితంగా తయారవుతుంది. ఇందులో వాడిన పదార్థాలన్నీ ఇంట్లో అందుబాటులో ఉండేవే గనుక ఎక్కువ ఖర్చు కూడా వద్దు. కేవలం మన కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. కాంతివంతమైన ముఖం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Leave a Comment

error: Content is protected !!