DIY Rice Flour Face Mask Recipes for Skin Whitening

ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా సరే తెల్లగా మెరిసిపోతుంది, రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు

పండుగ సీజన్ వచ్చిందంటే అందరూ అందంగా కనిపించడం కోసం పార్లర్కు వెళ్లి రకరకాల  ఫేషియల్స్ ట్రై చేస్తూ ఉంటారు.  ఫేషియల్ చేయించుకున్నప్పటికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. పండగ సమయంలో ఇంట్లో పనులుతో పార్లర్ కి వెళ్ళడం కూడా కుదరదు. అలాంటప్పుడు ఈజీగా ఇంట్లోనే అతి తక్కువ ఖర్చులో మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా ఆరెంజ్ పీల్ పౌడర్ను వేసుకోవాలి. 

    ఆరెంజ్ పీల్ పౌడర్ పడదు అనుకున్నవారు ముల్తానీ మట్టిని వేసుకోవాలి.  ముల్తానీ మట్టి కూడా వద్దు అనుకున్నవారు  సెనగపిండి  కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఒక చెంచా కాఫీ పౌడర్ చేసుకోవాలి  కెఫిన్ అనే పదార్థం చర్మంపై ఉండే టాన్  రిమూవ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ వైట్ గా చేయడంలో  కూడా చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత గిన్నెలో ఒక చెంచా పెరుగు వేసుకోవాలి పెరుగు ముఖంపై ఉండే జిడ్డు, మురికి పోగొట్టడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

    తర్వాత ఒక చెంచా పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవాలి. మనకు మార్కెట్లో పీల్ ఆఫ్ మాస్క్ అతి  తక్కువ ఖర్చులో  20 రూపాయలకు  కూడా లభిస్తుంది. కాబట్టి దీనికోసం మన ఇంట్లో ఉండే పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నాము. ఒక పీల్ ఆఫ్ మాస్క్  మాత్రమే  బయట నుండి తెస్తున్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు అవ్వదు. మేము ఫేషియల్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టలేము అనుకున్నవాళ్ళు కూడా ఈ ప్యాక్ ను ట్రై చేయవచ్చు. వీటన్నిటినీ బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 

      అప్లై చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన  తర్వాత మాస్క్ ను అంచుల వెంబడి లాగితే పీల్ లాగ వచ్చేస్తుంది. ఇలా రావడం వలన ముఖం పై ఉండే జిడ్డు, మురికి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. ముఖంపై ఉండే టాన్  మొత్తం పోయి  అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను ఏదైనా పండుగలప్పుడు లేదా వారానికి రెండు సార్లు ట్రై చేయడం వలన మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వలన మీ ముఖంలో ప్రత్యేకమైన గ్లో వస్తుంది.  ఈ ప్యాక్ ను మీరు  కూడా అవసరం అనిపిస్తే ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!