do-you-drink-more-kashayam-to-increase-your-immunity-power-u-must-read-this

కషాయాలతో జర జాగ్రత్త

కరోనా ప్రభావమో ఏమో కాని ప్రతి ఇంట్లో చాలా మంది కషాయాలు తయారుచేసుకుని తెగ తాగేస్తూ ఇమ్యూనిటీ పెంచుకుంటున్నామని భ్రమ పడుతున్నారు. అయితే ఏదైనా పరిమితికి మించి చేసే పని ఎప్పుడూ హానికరమే అనే విషయాన్ని గ్రహించక రోజూ మూడుపూటలా ఆకులు, చూర్ణాలు అడ్డదిడ్డంగా వాడేస్తూ. అల్లం, శొంఠి, మిరియాలు, వెల్లుల్లి వంటి దినుసులను ఎక్కువ ఉపయోగిస్తూ ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరున కషాయాలు తాగేస్తున్నారు. అవి తాగడం వల్ల కూడా సమస్యలు వస్తాయా అనే అనుమానం మీకు రావచ్చు.  మీ సందేహ నివృత్తి కోసం చదవండి మరి.

అసలు కషాయాలు ఎందుకు తాగాలి??

సాధారణంగా కషాయాలు అనేవి జ్వరం, జలుబు వంటి సమస్యలు వచ్చినపుడు మనకు పెద్దలు ఇచ్చే ఔషధం. కొన్ని జబ్బులు చేసినపుడు వైద్యులు సూచించేవి కూడా. ఇది రుచి పరంగా ఘాటుగా, చేదుగా మన శరీర స్థితిని బట్టి తియ్యగా ఇలా రకాలుగా తయారు చేసి ఇచ్చేవారు. అయితే ఈ కరోనా కాలం లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి దినులు ఉపయోగించి కషాయాలను తయారు చేసుకుని వాటికి బెల్లం ను  జోడించి రోజుకు మూడు పూటలా తాగుతున్నారు. అల్లం, వెల్లుల్లి, మిరియాలు స్వతహాగా వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని రోజులో మూడు పూటలా తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా శరీరం తొందరగా నీరసించిపోయినట్టు అయిపోయి మనలో ఉన్న కాసింత శక్తిని కూడా మనం విచ్చిన్నం చేసుకున్నవారం అవుతాము. 

అలాగే ఇరుగు పొరుగు చెప్పే మాటలు, కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసే రెసిపీ లు చూసి వివిధ రకాల ఆకులతో కషాయాలు తయారు చేసుకుని వాడేస్తుంటారు. వీటి వల్ల శరీరం లో ఆహారవ్యవస్థ దెబ్బతిని జీర్ణాశయ సంబంధ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.

నమ్మలేని మరొక నిజం కానీ నమ్మాల్సిందే

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇలా ప్రతి రోజు తీసుకునే కషాయాల వల్ల కాలేయం పనితీరు అస్తవ్యస్తం అవుతుంది.  పైత్యరసాన్ని విడుదల చేసి జీర్ణక్రియకు తోడ్పడే ఈ వ్యవస్థ అతిగా తీసుకునే కషాయాల వల్ల మందగిస్తుంది. అంతే కాకుండా కాలేయం దిగువ భాగాన ఉండే క్లోమగ్రంధి  విడుదల చేసే క్షార ద్రవాలలోని బైకార్బనేట్లు, లవణాల వల్ల  రక్త ప్రసరణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది.

                  అయితే క్లోమ గ్రంధి విడుదల చేసే ఇన్సులిన్ హార్మోన్ మన శరీరం లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కానీ అందరూ కషాయాలను తెగ తాగేయడం వల్ల క్లోమ గ్రంధిలో సరిపడినంత ఇన్సులిన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల శరీరం లో చెక్కర స్థాయిలు అనూహ్యంగా పెరిగిపోయి, అది మధుమేహం వైపుకు దారితీసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే  మధుమేహంతో బాధపడుతున్న వారు తాము రోజూ  తీసుకునే మెడిసిన్ ను వాడుతూ వీలైనంతవరకు ఈ కషాయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 

 చివరగా……..

                ఆరోగ్యం గా ఉన్నవాళ్లు కూడా కరోన భయంతో వీటిని ఎడాపెడా తాగేయకుండా కాసింత యోగ ను  రోజువారీ కృత్యాలలో మేళవించుకుంటే అంతకు మించిన ఇమ్యూనిటీ ఇంకేది ఉండదు. అలాగే నిద్రించే ముందు పసుపు కలిపిన పాలు తీసుకోవడం కషాయాలకు ప్రత్యామ్నాయం మరియు ఉత్తమం కూడా.

Leave a Comment

error: Content is protected !!