do you know facts about maida

మైదా పిండి గూర్చి వణికిపోయే నిజాలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు.

◆ఉదయాన్నే అల్పాహారం తినాలని చూస్తామా….బంగారు రంగులో మెరిసిపోతున్న మైసూర్ బజ్జిని  చూస్తుంటే మనసాగదు. వేడివేడిగా అవురావురుమంటూ తినేసి ఇంటికెళ్లి మళ్ళీ ఒకపట్టు పడతాం.

◆పొరలు పొరలుగా సుతిమెత్తగా మనవైపు చూస్తున్న పరోటాను చూస్తే నిలువెల్లా ఆకలి లేచొస్తుంది, ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టి రాగానే తుంచేస్తూ కూర్మాలో ముంచేస్తూ తింటూ ఉంటే మనసుకు ఉల్లాసం. 

◆చోలే బతురా, రవ్వ దోస, పిజ్జాలు, పాన్ కేక్ లు వీటికి అంతు అనేది ఉందా??

◆చెక్కర పాకంలో మునిగిపోయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మడత ఖాజాలు, బాదుషా స్వీట్లు, ఇంట్లో చేసే పూర్ణపు బొబ్బట్లు ఓహ్ వీటిని  చూస్తూ ఒకసారి తిని తృప్తి పడిపోయే స్వభావం మనకు ఉందా?? 

ఇంత జిహ్వ చాపల్యం తో మనం ఎగబడి తినే ఈ పదార్థాలు అన్ని మైదా పిండితో తయారవుతాయని మనకు తెలిసిందే. అయితే మైదా తో గేమ్స్ ఆడొద్దని చెబుతున్నారు నిపుణులు. 

మైదా ఎంత డేంజర్ అనేది ఒకసారి మీరే చదివి చూడండి.

అసలు మైదా అంటే ఏంటి ఎలా తయారు చేస్తారు.

◆మైదా కూడా గోధుమలు నుండి తయారు చేసేదే అయితే  అజోడికార్బోనమైడ్, క్లోరిన్ గ్యాస్ మరియు బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను కలిపి తెల్లగా పాలిష్ చేయడం ద్వారా మైదాను తయారు చేస్తారు.

◆ఇది తెల్లగా, మృదువుగా ఉండటానికి కారణం అల్లోక్సాన్ అనే విషపూరిత రసాయనం. ఇప్పటికే అర్థమైందనుకుంటా మైదా అనేది రసాయన పదార్థాల మిశ్రమం అని.

ఇంతకు మైదా ఏవిధంగా ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుంది

◆మనం తీసుకునే ఆహారం ఏదైనా జీర్ణం కావడానికి రెండు నుండి మూడు గంటల సమయం తీసుకుంటుంది. ఆయితే ఆహారంలో ఉన్న పోషకాలు, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. 

◆మైదా పిండిలో రసాయనాలతో కూడిన పిండి పదార్ధాలే తప్ప పీచు పదార్థం ఒక శాతం కూడా లేదు అందుకే ఇది జీర్ణం కావడానికి మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. అంతేనా ఈ మైదా కారణం తోనే కడుపులో చాలా వరకు పుండ్లు, ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

◆సినిమా పొస్టర్లు ఏవిధంగా మైదా ఉపయోగించి గోడకు అతికిస్తే పర్ఫెక్ట్ గా అతుక్కుంటాయో అదే విధంగా మన కడుపులో జీర్ణాశయపు గోడలకు కూడా మైదా అతుక్కుపోతుంది. ఇది అంత తొందరగా కరగదు కాబట్టి జీర్ణాశయపు గోడలు మెల్లిగా ధ్వంసమవుతూ జీర్ణకోశ సామర్థ్యాన్ని కోల్పోతాయి.

◆కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, గుండెజబ్బులు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వంటివి రావడంలో మైదా పిండి పాత్ర ఎంతో ఉంటుంది.

◆మైదా పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట వస్తుంది. ఎన్ని చేసినా తగ్గకుండా ఫిక్స్ అయిపోతుంది.

◆మైదాలో గ్లైకమాక్స్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం తొందరగా వస్తుంది. ఒంట్లో గ్లూకోజ్ లెవల్స్ ను తొందరగా పెంచడంలో ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. అందుకే ప్రస్తుతం ముప్పయ్యేళ్లు కూడా నిండని యువతలో కూడా మధుమేహం రావడం చూస్తున్నాము. కారణం బేకరీల్లో, బయట రెస్టారెంట్లలో,  చివరికి చిన్న హోటల్స్ లో కూడా మైదాను విరివిగా వాడటం అందరూ వాటిని ఇష్టానుసారంగా తినేయడం.

చివరగా……

మనకు బెస్టు టేస్ట్ ను ఇచ్చే ఈ మైదా పిండిలో వాడే హానికర రసాయనమైన బెంజాయిల్ పెరాక్సైడ్ చాలా హానికరమైనది. అందుకే దీనిని చైనా, ఐరోఫా దేశాల్లో బ్యాన్ చేశారు కూడా. కానీ మనం మాత్రం రుచిమరిగి ఆరోగ్యాన్ని బలిచేసుకుంటున్నాం. హోటల్స్, రెస్టారెంట్లు కూడా గోధుమ పొంది కంటే సగం ధరకే వస్తూ రుచిని ఇస్తుందనే కారణంతో మైదాకే ఓటు వేస్తున్నారు.  ఇప్పటికైనా కళ్ళు తెరవండి మైదాను దూరం పెట్టండి. సగం జబ్బులు మనకు దూరం ఉన్నట్టే మీరు ఈ పని చేశారంటే. 

Leave a Comment

error: Content is protected !!