ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు తగ్గించుకోవడం కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాటిలో భాగంగా నిమ్మకాయ రసం కలిపిన నీటిని పరగడుపున తీసుకోవడం చాలా మంది పాటించే చిట్కా. ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది కూడా. అయితే మాములుగా తీసుకునే ఈ నిమ్మకాయ రసం నీటిని కొద్దిగా వేరే పద్దతిలో తయారు చేసుకుని తాగితే, పొట్ట, నడుము, పిరుదులు ప్రాంతాల్లో ఉన్న అధిక కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది. వేలాది రూపాయలు ఖర్చు చేసిన ఇవ్వని సత్వర ఫలితాన్ని ఇపుడు చెప్పబోయే నిమ్మకాయ రసం కలిపిన నీళ్లు ఇవ్వగలవు. మరి కొత్తరకం రహస్యం ఏమిటో తెల్సుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- నిమ్మకాయల రెండు
- జీలకర్ర పొడి
- నీళ్లు
తయారు విధానం
ముందుగా ఒక నిమ్మకాయను కీరదోస చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయలను ఒక గిన్నెలో వేసి అందులో దాదాపు అరలీటర్ నీళ్లు పోయాలి. ఇందులో సగం టీస్పూన్ జీలకర్ర పొడి వేయాలి. దీన్ని స్టవ్ మీద దాదాపు మూడు నిమిషాలు పాటు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యేవరకు గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.
ఇపుడు మిగిలిన ఇంకొక నిమ్మకాయను కట్ చేసుకుని రసం పిండుకోవాలి. ఇలా పిండుకున్న రసాన్ని, మరిగించి గోరువెచ్చగా చేసుకున్న నీటిలో వేసి కలిపేయాలి. ప్రభావ వంతమైన తక్కువ సమయంలో బరువు తగ్గించగల నిమ్మకాయ నీళ్లు రెడి అయినట్టే. మీ రుచిని బట్టి నిమ్మకాయను తగ్గించుకోవచ్చు కూడా.
ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తీసుకుంటే అధిక బరువు ఉన్నవారు అతి త్వరగా సన్నబడతారు. పొత్తి కడుపు, నడుము, పిరుదుల ప్రాంతంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. శరీరానికి సరైన ఆకృతిని ఇస్తుంది.
నిమ్మరసం స్వతహాగా యాంటీ బాక్టీరియల్ గా పని చేస్తుంది కాబట్టి రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
నిమ్మకాయను ఉడికించడం వల్ల నిమ్మ తొక్కలో ఉన్న ఆమ్ల గుణాలు మరియు నూనెలు నీటిలో కలిసి శక్తివంతంగా తయారవుతుంది. ఒది జీర్ణాశయాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
జీలకర్ర జీర్ణ శక్తిని పెంచడంలో మరియు కడుపులో వికారం, ఉబ్బరం వంటివి తగ్గించడంలో పనిచేస్తుంది. ముఖ్యంగా మలబ్దక సమస్యను నివారిస్తుంది.
ప్రతిరోజు ఉదయం పరగడుపున మరియు రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత, నిద్రపోవడానికి అరగంట ముందు ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన పద్దతిలో, సులువుగా బరువు తగ్గుతారు.
చివరగా…..
నిమ్మరసం నీళ్లు సాధారణంగా తీసుకునేదే అయినా ఇలా సరికొత్తగా చేసి తాగి ఫలితాన్ని మిరే చూడండి. తప్పక ఆశ్చర్యపోతారు.