do you know health benefits of salt

ఉప్పు చేసే ముప్పు కాదు గొప్ప గూర్చి చెప్పమంటారా!!

ఉప్పులేని వంటను మనం ఊహించలేము. వండిన పదార్థాలకు రుచిని,  శరీరానికి బలాన్ని అందించడంలో ఉప్పు పాత్ర మరువలేనిది. అలాంటి ఉప్పు చేటు చేస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఉప్పుతో మన శరీరానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చాలా కొద్దిమందికి  మాత్రమే తెలుసు మరి ఇప్పుడు తెలుసుకుంటే సమస్య లేదుగా అందుకే మరి ఉప్పుతో గొప్ప ప్రయోజనాలు చదివేద్దాం రండి.

◆ కడుపునొప్పి, అజీర్తి వినతి సమస్యలు ఇబ్బంది పెడుతున్నపుడు వాము, ఉప్పు కలిపి తింటే తొందరగా ఉపశమనం లభిస్తుంది.

◆ కీళ్ల వాతం, బెణుకులూ, వాపులు, ఇంకా ఇతర నొప్పులు శరీరాన్ని చుట్టుముట్టినపుడు ఉప్పును బాగా వేయించి కాపుడం పెడితే వేడి ఎక్కువ సేపు శరీరానికి ప్రసారం అయ్యి ఇబ్బంది ఉన్న ప్రాంతంలో పట్టుకుని తొందరగా తగ్గేలా చేస్తుంది.

◆ ఎండాకాలంలో వడదెబ్బ తగిలినపుడు శరీరం శోషించి నీరసపడి చాలా సమస్య ఎదురైనప్పుడు వేడినీళ్లలో పంచదార, ఉప్పు కలిపి తాగిస్తే ఎలాంటి భయపడవలసిన అవసరం ఉండదు. ఇదే కాదు విరేచనాలు, వాంతులు ఎక్కువై శోష వచ్చినపుడు కూడా మనిషి నీరసించిపోతే  ఉప్పు, పంచదార కలిపిన వేడినీటిని తాగించడమే ఉత్తమం.

◆ చాలామందికి బోజనం చేయగానే కడుపునొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు నెయ్యి ఉప్పు రెండింటిని వేడి నీళ్లలో కలిపి తాగిస్తే  సమస్య తగ్గుతుంది.

◆ దగ్గు, అజీర్తి సమస్యతో బాధపడే పిల్లలకు ఉప్పును అరగదీసి నాలికకు రాస్తే విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే దగ్గు కూడా తగ్గుతుంది.  అయితే ఈ ఉప్పు అరగదీసి ఇచ్చేటపుడు చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే వాంతులు అవుతాయి.

◆ నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే నోటిలో పుండ్లు, పంటి నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించి చల్లార్చి ఆ నీరుతో పండును కలిగితే, నీరు లాగేసి పండు త్వరగా మానిపోతుంది. కండ్ల కలక వచ్చినపుడు కూడా కంట్లో ఉప్పు నీరు వేసి కడిగితే కంటి వాపు తగ్గిపోతుంది. 

◆ ఉప్పు వాతాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్జిమా అనే చర్మ వ్యాధిలో దురద తగ్గడానికి మరియు ఆయాసం తగ్గడానికి ఇతర ఎలర్జీ వ్యాధులలోనూ కాలికోస్టిరాయిడ్స్ అనే తరగతికి చెందిన మందులు వాడవలసినపుడు  మాత్రం చెడు లక్షణాలు కలుగకుండా ఉండటానికి  ఉప్పు వాడకం తగ్గించమని వైద్యులు సూచిస్తారు.

◆ ఉప్పు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నా శరీరంలో ఉప్పు శాతం అధికమైతే వాంతులు, బిపి, రెట్టింపు పెరగడం,  నీరు పట్టడం వంటి లక్షణాలు కలుగుతాయి.

చివరగా……

పైన చెప్పుకున్నట్టు అన్ని సమస్యలను నివారించగల అద్భుతమైన పరిష్కారాలు ఉప్పులోనే దాగి ఉన్నాయ్ కాబట్టి ఉపు ముప్పని అనుకోకుండా సమస్య ఉన్నపుడు ఉపయోగించి గొప్పగా ప్రయోజనాలు పొందండి

Leave a Comment

error: Content is protected !!