do you know hidden health benefits of coriander seeds

ధనియాలలో ఇన్ని అద్భుతాలు దాగున్నాయని మీకు తెలుసా????

కొత్తిమీర లేని వంటకు సువాసన తక్కువ. వంటలకు ఇది ఇచ్చే అదనపు రుచి కూడా అమోఘం. సాధారణంగా కొత్తిమీరను మాత్రమే కాకుండా సాంబార్ రసం, మసాలా వంటకాల్లో దనియాలను వాడుతుంటాము. కొత్తిమీర మొక్క నుండి లభించే ఈ ధనియాలు వంటకాలకు రుచిని మాత్రమే కాదు శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇంతకు ఈ దయనియాల వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం పదండి. 

కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచడంద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.  వీటిలో ఉండే ఫైబర్ లిపిడ్ జీవక్రియను పెంచుతుంది.  కొవ్వు ఆమ్లాలు (లినోలెయిక్, ఒలేయిక్ మరియు పాల్మిటిక్ ఆమ్లాలు) మరియు ఇందులోని నూనెలు (లినూల్, కాంపేన్ మరియు టెర్పెన్) సమర్థవంతమైన జీర్ణ క్రియకు కారణమవుతాయి. ఇంకా ధనియాలు ఎలా  పని చేస్తాయి పూర్తిగా చూద్దాం.

గుండె ఆరోగ్యానికి 

ధనియాలలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణంఉంది.  కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి..

ఇవి ప్లేట్‌లెట్ల తగ్గుదలను అడ్డుకుంటాయి.  ధమనులలో ప్లేట్‌లెట్ అగ్రిగేషన్ సంభవిస్తే, ఇది గుండెకు రక్త ప్రవాహం బలహీనపడటానికి దారితీస్తుంది. ఈ చర్యను అడ్డుకునే సామర్థ్యము దనియాలలో ఉంది.

మన శరీర వ్యవస్థలో లిపిడ్ల జీవక్రియలో ధనియాలు ముఖ్యమైన పాత్ర పోషిస్థాయి. దనియాలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

డయాబెటిస్ ( మధుమేహం)

ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడతాయి.  ప్యాంక్రియాటిక్ బీటా కణాల పనితీరును మెరుగుపరచడం ద్వారా  చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. (ఇన్సులిన్‌ను విడుదల చేసే కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి) 

ధనియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ తో సంబంధం ఉన్న హృదయనాళ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ధనియాలు జీర్ణక్రియను  మెరుగుపరచడంలో ఎప్పటి నుండో వాడుతున్నారు.   శరీరంలో వాత,పిత్త, కఫాలను సరైన స్థాయిలో  ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

చిన్న ప్రేగులలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ అయిన ట్రిప్సిన్ ను అణిచివేయడం ద్వారా జీర్ణక్రియను పెంచుతాయి. అంతే కాదు వికారం మరియు విరేచనాలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి 

ఆర్థరైటిస్ సమస్యను తగ్గిస్తుంది

ధనియాలు సైనోవియంలోని ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ యొక్క చర్యతో పోరాడటం ద్వారా ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.  వీటిలో రెండు ముఖ్యమైన సమ్మేళనాలు అయిన సినోల్ మరియు లినోలెయిక్ ఆమ్లం యాంటీ రుమాటిక్ మరియు యాంటీ ఆర్థరైటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

కండ్లకలక తగ్గిస్తుంది

కంటి దురద తగ్గించడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. దురద కండ్లకలక యొక్క ప్రధాన లక్షణం దీన్ని ధనియాలు దీన్ని సులువుగా తగ్గిస్తాయి. ధనియాలు ఉడికించిన నీటితో కళ్ళను తుడుచుకుంటూ ఉండాలి.

మహిళల్లో ఋతు సమస్యలకు 

ఋతు లక్షణాలైన కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు మొదలైనవాటికి  చికిత్స చేయడంలో ధనియాలు బాగ పని చేస్తాయి. దనియలను నీటిలో వేసి బాగా మరిగించి  చేసిన టీ  నెలసరి లో  అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

నాడీ ఆరోగ్యాన్ని పెంచుతుంది

దనియాలలో లినూల్ ఒక ప్రధాన సమ్మేళనం.  లినలూల్ మానవులలో ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. లినలూల్ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది యాంటికాన్వల్సెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంది (మూర్ఛలు లేదా మూర్ఛ ఫిట్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది) 

అల్జీమర్స్ వంటి నాడీ వ్యాధుల నివారణలో ధనియాలు రక్షణ పాత్ర పోషిస్తాయి.  

చివరగా…..

ధనియాలు మనం ప్రతిరోజు వాడుతున్నవే అయితే వాటి ప్రయోజనాలు తెలిసాక తప్పనిసరి చేసుకుంటాం. అంతేగా మరి ఆరోగ్యమే మాహాభాగ్యం.

Leave a Comment

error: Content is protected !!