Real facts behind kalonji seeds

నల్లజీలకర్ర లో నిజాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం

ప్రపంచంలో మొత్తం మీద ఉపయోగించేవి అన్ని మనకు తెలియవు. అంతవరకు ఎందుకు మన పొరుగు రాష్ట్రాల్లో వాడే కొన్ని పదార్థాలు మనకు తెలియవు. కానీ వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆరోగ్యపరంగా. జీలకర్ర అందరికి తెలిసినదే అయితే నల్లజీలకర్ర అనేది ఎవరికైనా తెలుసా?? ఈమధ్య కాస్త అడపాదడపా వింటున్నా 90% మందికి అసలు ఈ నల్ల జీలకర్ర అనేది తెలియనే తెలియదు. నల్లజీలకర్ర ఎలా ఉంటుంది, దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి??  ఇదే ఇవ్వాళ మనము చెప్పుకునే విషయం.

◆ కలోంజి సీడ్స్ లేదా నల్లజీలకర్ర గా పిలుచుకునే ఈ విత్తనాల గూర్చి చాలా మంది ఉల్లిపాయ విత్తనాలు అనే అపోహ పడుతుంది. అయితే ఇవి నల్లజీలకర్ర ఉల్లిపాయ విత్తనాలు కావు. ఈ నల్లజీలకర్ర లో విటమిన్-బి1, బి2, బి3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ నల్లజీలకర్ర లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సప్లమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.

◆ప్రస్తుత కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య రక్తసరఫరా సవ్యంగా లేకపోవడం. దీనివల్ల కండరాల తిమ్మిర్లు, అవయవాలు మొద్దుబారినట్టు ఉండే భావన కలుగుతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. అయితే నల్లజీలకర్ర మనశరీరంలో రక్తసరఫరాను మెరుగు పరుస్తుంది. రక్తసరఫరా ఎప్పుడైతే సవ్యంగా జరుగుతుందో అపుడు గుండె ఆరోగ్యం కూడా దృఢంగా ఉంటుంది.

kalonji-seeds-for-hair
Kalonji seeds for hair growth

◆ఈమధ్య కాలంలో నల్లజీలకర్ర కాసింత వెలుగులోకి వచ్చినది అంటే కేవలం జుట్టుసంరక్షణలో భాగంగానే. నల్లజీలకర్రను జోడించి నూనెలు తయారు చేయడం, నల్లజీలకర్రను పేస్ట్ గా చేసి జుట్టుకు హెయిర్ పాక్ లు వేయడం వంటి పద్ధతుల వలన జుట్టు ఊడిపోవడం తగ్గి ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు దురదలు తలలో పుండ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు మాయమైపోతాయి.

◆నల్లజీలకర్ర ను తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ ను క్రమబద్దీకరిస్తుంది. దీనివల్ల  షుగర్ ఉన్న వారి ఆరోగ్యంకు ఎంతో మంచిది. 

◆అస్తవ్యస్తమైన మన జీర్ణవ్యవస్థను ఒక ట్రాక్ లో పెట్టడం నల్లజీలకర్ర వల్ల సాధ్యమవుతుంది. జీర్ణవ్యవస్థను  మెరుగు పరిచి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.

◆మన శరీరంలో ముఖ్యమైన భాగమైన కాలేయం పనితీరును మెరుగు పరచడంలో నల్లజీలకర్ర సమర్థవంతమైనది

◆నల్లజీలకర్ర ద్వారా తయారు చేసిన నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగానూ యవ్వనంగానూ ఉంటుంది.

◆బాక్ పెయిన్ అనేది ఇప్పటికాలం లో సర్వసాధారణం అయిపోయింది.  10 మదిలో కనీసం 7 మంది అయినా ఈ వెన్నునొప్పి తో బాధపడుతున్నారు. అలాంటివాళ్ళు నల్లజీలకర్ర నూనెతో వెన్నుకు మసాజ్ చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

◆మన శరీరాన్ని అటాక్ చేసే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు నుండి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మరియు ఎముకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది

◆వీర్యకణాల లోపంతో బాధపడే మగవాళ్ళు నల్లజీలకర్ర తీసుకోవడం వల్ల  వీర్యవృద్ధి జరుగుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా  ప్రాముఖ్యం వహిస్తుంది.

◆మూత్రపిండాల పనితీరు మెరుగుపరిచి మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

◆నరాల బలహీనత తో ఇబ్బంది పడేవారు నల్లజీలకర్రను తీసుకోవడం వల్ల నరాలలో బలం పుంజుకుంటుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

చివరగా…..

ఇన్ని చెప్పుకున్న ఈ నల్లజీలకర్ర లో దాగున్న ఇన్ని ఉపయోగాలు  ఇప్పటిదాకా మనకు తెలియకపోవడం అంటే కాసింత బాధాకరమైనదే అయినా ఇప్పటికైనా మించిపోయినది ఏమిలేదుగా……

2 thoughts on “నల్లజీలకర్ర లో నిజాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం”

Leave a Comment

error: Content is protected !!