బొప్పాయి పండు క్యాలరీస్ తక్కువ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని, పొట్టకు హాయిగా ఉంటుందని తెలిసి అందరూ ప్రతినిత్యం తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఓబైసిటీ ఉండే వారికి కూడా బొప్పాయి పండు చాలా మంచిది. ఇటువంటి బొప్పాయి తినేటప్పుడు అందులో గింజలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో సీడ్ లెస్ చాలా కనిపిస్తున్నాయి గాని, కొన్ని నాటు వెరైటీలు విత్తనాలు కలిగి ఉంటాయి. పచ్చి బొప్పాయి విత్తనాలు అందరూ తీసేస్తూ ఉంటాం. అవి చాలా చేదుగా ఉంటాయి.
పచ్చి బొప్పాయి విత్తనాలు తినకూడదు ఆ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎండిన బొప్పాయి విత్తనాలు తినవచ్చు. వీటిని రోజు రెండు గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు తినగలిగితే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అని సైంటిఫిక్ గా నిరూపించారు. ముఖ్యంగా 2004లో యూనివర్సిటీ ఆఫ్ పుత్రా మలేషియా. మలేషియా దేశం వారు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ ఎండు బొప్పాయి విత్తనాలలో 100 గ్రాములలో 20% ఫైబర్ ఉంటుంది. కేజీ ఎండు బొప్పాయి విత్తనాలు సుమారు 800 నుంచి 1000 రూపాయలు వరకు ఉంటుంది.
ఈ ఎండు బొప్పాయి విత్తనాలు వాడడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ప్యాట్ ను గ్రహించడానికి పేగులలో నుంచి కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచడానికి అనగా బ్లడ్ లో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అని, పేగులలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రై గ్లీజరీన్స్ పెరగకుండా బాగా కంట్రోల్ చేస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అదేవిధంగా పైల్స్ ఉన్నవారికి, పేగులలో డైజెషన్ ఇబ్బంది ఉన్నవారికి, ఇమ్యూనిటీ డౌన్ అయిన వారికి ఎండు బోప్పాయి విత్తనాలు బాగా పనికొస్తున్నాయి.
పైల్స్ ఉన్నవారికి, బ్లీడింగ్ అయ్యే వారికి చాలా మంచిది అని, మలబద్దకం రాకుండా ఉండడానికి చేయడానికి, పేగులలో హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి అవ్వడానికి, ఇలాంటి సమస్యలను మలద్వారంలో ఇబ్బంది లేకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సైంటిఫిక్ గా ఉంది. అందుకని ఎవరైనా పచ్చి బొప్పాయి విత్తనాలు మాత్రం తినకండి. ఎండు బోప్పాయి విత్తనాలు లేదా బొప్పాయి తిన్నప్పుడు వచ్చే విత్తనాలను ఎండబెట్టుకొని వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఫైబర్ రూపంలో అన్ని లాభాలు కలిగిస్తుంది కాబట్టి ఆసక్తి ఉన్న వారు ఉపయోగించుకోవచ్చు