వాలెంటైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ అంతటా మరియు ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో, సెయింట్ వాలెంటైన్ పేరుతో ప్రియమైన వారి మధ్య మిఠాయిలు, పువ్వులు మరియు బహుమతులు మార్పిడి చేయబడతాయి. అయితే ఈ మర్మమైన సెయింట్ ఎవరు మరియు ఈ సంప్రదాయాలు ఎక్కడ నుండి వచ్చాయి? వాలెంటైన్స్ డే చరిత్ర గురించి తెలుసుకోండి. రోమన్ చక్రవర్తి క్లాడియస్ II భార్యలు మరియు కుటుంబాలతో ఉన్నవారి కంటే ఒంటరి పురుషులు మెరుగైన సైనికులుగా ఉంటారని భావించి, అతను యువకులకు వివాహాన్ని నిషేధించాడు.
వాలెంటైన్, రాజు యొక్క అన్యాయాన్ని గ్రహించి, రహస్యంగా యువ ప్రేమికులకు వివాహాలు కొనసాగించాడు. వాలెంటైన్ యొక్క చర్యలు తెలిసి, క్లాడియస్ అతనికి మరణశిక్ష విధించాలని ఆదేశించాడు. అప్పుడు వాలెంటైన్ చాలా రోజుల పాటు జైలులో ఉంచారు అతడిని ఉంచిన జైలు అధికారి ఒక కూతురు తరచూ వస్తూ ఉండేది ఆమెకి కళ్ళు లేవు ఈ సెయింట్ తన శక్తుల వల్ల ఆమెకు కళ్ళు తెపించాడు, ఆరోజు వాలెంటైన్ కు మరణశిక్ష విధించే ముందు అతడు మేరీకి ఇట్లు నీ వాలెంటైన్ అని సంతకం చేసిన ఒక లెటర్ రాశాడు. అతను రోమ్ వెలుపల క్లాడియస్ II చేత శిరచ్ఛేదం చేయబడ్డాడు.
తర్వాత అతడిని ఫిబ్రవరి 14వ తారీఖున సమాధి చేశారని చెబుతారు అతడి వల్ల వివాహం అతడిని అభిమానించి అతడిని సమాధి చేసిన రోజున వాలెంటెన్స్ డే గా జరుపుకుంటారు. ఇది అనేక దేశాలలో వివిధ సంఘటనల మూడు పెట్టి ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు ఈ ఫెస్టివల్ మనదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున ప్రేమికులు ఇష్ట పడిన వ్యక్తికి కానుకలు ఎర్రటి గులాబి పూలను ఇస్తుంటారు. అంతే కాకుండా గ్రీటింగ్ కార్డులు కూడా బహుమతిగా ఇస్తుంటారు. ఈరోజు కలిసిన ప్రేమికులు జీవితకాలం ఆనందంగా ఉంటారని నమ్ముతారు. ఈ రోజున చాక్లెట్లు టెడ్డి బేర్ లు గులాబీ పువ్వులు వంటివి కోట్ల వ్యాపారం జరుగుతుందని నమ్ముతారు.