Does Wearing a Bra Increase Breast Cancer Risk

బ్రా ధరించడం వల్ల నిజంగా రొమ్ము క్యాన్సర్ వస్తుందా??

ప్రతి ఒక్కరి జీవితంలో ధరించే దుస్తుల ప్రాధాన్యత చెప్పలేనిది. కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ మనిషి కూడా అభివృద్ధి చెందాడు. ఒకప్పుడు ఆరు గజాల చీరను చుట్టేసుకున్న మహిళలు ఇపుడు బోలెడు రకాల మోడల్స్  బట్టలను దరిస్తున్నారు. అయితే శరీర సౌష్టవాన్ని బట్టే అందం కూడా అనేది పెరిగిపోయి మహిళలు లోపల దుస్తుల విషయంలో కూడా  ఎన్నో రకాలు తీసుకుంటారు. ముఖ్యంగా వక్షోజాలను కవర్ చేస్తూ దరిస్తున్న బ్రా లకు కూడా యాడ్స్ వచ్చేసాయంటే వాటి వ్యాపారం మహిళల కొనుగోలు అందరికి అర్థమవుతుంది.

అయితే చాలా మందిలో ఒక సందేహం ఉండిపోయింది. అదే బ్రా ను  ధరించడం వల్ల రొమ్ము కాన్సర్ వస్తుందనే విషయం. దీని గురించి వచ్చిన విషయాన్ని విశ్లేషించి సందేహాన్ని నివృత్తి చేసుకోవడమే ఈ వ్యాసం సారాంశం.

 యాంటిపెర్స్పిరెంట్ అనే రసాయనాలు చర్మం ద్వారా గ్రహించబడతాయి,  మనకు చమట పట్టడం అనే క్రియ ద్వారా శరీరంలోని మలినాలు టాక్సిన్లు విసర్జించబడతాయి. అయితే బ్రా ను ధరించడం వల్ల  టాక్సిన్స్ విడుదలను అడ్డుకుంటాయి. దీనివల్ల టాక్సిన్లు రొమ్ములో కణుతులుగా ఏర్పడటానికి కారణమవుతాయి.

 అండర్వైర్ బ్రా లు రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతాయి, అవి రొమ్ము దిగువ నుండి శోషరస ద్రవం యొక్క ప్రసరణను నిరోధించడం ద్వారా  శరీరంలోకి తిరిగి రావు.

అయితే చాలా మంది వీటిని కేవలం పుకార్లుగానే భావిస్తున్నారు. వీటి వెనుక వ్యాపార ప్రయోజనాల వల్లనే వీటిని పుకార్లని, వాస్తవం లేదని అంటున్నారనే వాదన కూడా నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్త్రీ లు ధరించే జాకెట్ లు, బ్రా లు రెండింటిని పోల్చి చూస్తే రెండింటిలో ఉన్న వ్యత్యాసం ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ అనేది బ్రా దరించినపుడు రొమ్ముల కింద భాగంలో ఉన్న చర్మానికి బిగుతుగా అతుక్కుపోతుంది. దీనివల్లనే  రొమ్ముల కదలికలు కూడా లేకుండా స్థిరంగా ఉంటాయి. ఇలా బిగుసుకోవడం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. అంతేకాదు బ్రా తయారయ్యే  వస్త్రం కూడా సమస్యకు కారణం అవుతుంది.

【  కానీ కొందరి వాదన

 బలమైన యాంటీపెర్స్పిరెంట్ కూడా చెమటలను నిరోధించదు.  క్యాన్సర్ కలిగించే చాలా పదార్థాలు మూత్రపిండాల ద్వారా తొలగించబడతాయి మరియు మూత్రం ద్వారా విడుదల చేయబడతాయి, కాలేయం ద్వారా నియంత్రించబడతాయి.  శరీరంలో వ్యర్థాలు, మలినాలు విడుదల చేయడానికి చెమట ఒక ముఖ్యమైన మార్గం కాదు, కేవలం ఒక భాగం మాత్రమే. సువాసన మరియు సంరక్షణ కోసం ఉపయోగించే థాలెట్స్ మరియు పారాబెన్స్ వంటి రసాయనాల గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఉత్పత్తుల మొత్తం జాబితా నుండి (యాంటిపెర్స్పిరెంట్లతో సహా) శరీరం గ్రహించినప్పటికీ, ఈ రసాయనాలు రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం లేదు.】

పైన చెప్పుకున్న కొందరి వాదనలో వాస్తవం ఎంత అనేది పరిశీలిస్తే ఆరోగ్యం కంటే బ్రా ల విక్రయాలు పెరిగితే మంచిది అనే ఆలోచన స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.బ్రా ధరించడం మహిళల జీవితంలో భాగమైనప్పటికి. ఎక్కువ సేపు ధరించడం మాత్రం ప్రమాదమని చెప్పవచ్చు. రొమ్ములను పట్టి ఉంచడం వల్ల రక్తప్రసరణ, కండరాల కదలిక  కేవలం ఒకచోట మాత్రమే జరుగుతుంది. దీనివల్ల శరీరం మొత్తం జరగాల్సిన రక్తప్రసరణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అంతే కాదు అదే భాగంలో ముఖ్య అవయవమైన గుండె కూడా ఉందని విషయం మర్చిపోకండి.

చివరగా…….

బ్రా దరించడం వెనుక రొమ్ము కాన్సర్  వస్తుందనే  విషయం పట్ల ఎవరు పూర్తి సందేహాన్ని నివృత్తి చేయనప్పటికి. కాసింత సైన్స్ పరంగా ఎవరికి వారు ఆలోచన చేస్తే బ్రా ఎక్కువ సేపు ధరించడం వల్ల సమస్య వస్తుందనే విషయాన్ని ఒప్పుకుని తీరతారు. ది రొమ్ము కాన్సర్ మాత్రమే కాకపోయినా ఒత్తిడి వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బది పడటం, రక్తప్రసరణ మందగించడం వల్ల గుండెకు రక్తసరఫరా మందగించడం, కండరాల నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు. మీకు మీరే విశ్లేషించుకోండి మరొక్కసారి.

Leave a Comment

error: Content is protected !!