dont bring these items from mothers home

ఆడవారు పెళ్ళయిన తర్వాత మర్చిపోయి కూడా ఈ వస్తువులను పుట్టింటి నుండి అత్తింటికి తీసుకువెళ్ళకండి.

ఆడపిల్లలు పెళ్లి అయినప్పటి నుండి అమ్మ గారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళుతూ ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తూనే ఇది నా కోసమేనా, ఇది నాదేనా అంటూ ఆ వస్తువుని తనకోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిల్లుపై ఉండే హక్కుగా భావిస్తారు. అలా తీసుకెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి.

 కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మీరు ఇంతకుముందు పుట్టింటినుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకు వెళ్ళ కూడదు ఇప్పుడే తెలుసుకోండి. దాని వలన పుట్టింటికి అత్తింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి.

 అందులో మొదటిది కత్తులు, కత్తిపీట, చాకులు, కత్తెరలు వంటివి. ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉందట. మనస్పర్థలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు గా మారే అవకాశం ఉంది. అందుకే కత్తి లాంటి వస్తువులను అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు.

 రెండవది వస్తువు చింతపండు, ఉప్పు. చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటివారు వారు కొని పెడుతూ ఉంటారు. ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి. ఇవి పెట్టడం  వలన రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని నమ్మకం. అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవి తో సమానం. అమ్మగారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారి ఇంటికి తీసుకెళ్లడం వలన పుట్టిల్లు పేదరికం బారిన పడుతుందనే నమ్మకం.

 అలాగే తవ్వా, చేట అమ్మగారి నుండి తీసుకు వెళ్ళకూడదు. ఎందుకంటే వీటిని అశుభాలకు వాడుతూ ఉంటారు. అలా తీసుకు వెళితే అశుభం జరుగుతుంది అనేది పెద్దల నమ్మకం. అందుకే ఇప్పటి నుండి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకువెళ్ళకండి. ఏదైనా తీసుకువెళ్లే ముందు పెద్ద వారి సలహా తీసుకోండి.

1 thought on “ఆడవారు పెళ్ళయిన తర్వాత మర్చిపోయి కూడా ఈ వస్తువులను పుట్టింటి నుండి అత్తింటికి తీసుకువెళ్ళకండి.”

Leave a Comment

error: Content is protected !!