dont do these mistakes after vaccination

కరోనా టీకా వేసుకున్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి

ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాండమిక్లో కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి వాక్సిన్ చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి సూచనలు అవసరం. అప్పుడు మీకు ప్రతి విషయం వివరంగా అర్థం అవుతుంది. మామూలుగా ఏదైనా నొప్పి రాగానే ఏదో ఒక పెయిన్ కిల్లర్ పేరు చెప్పి వాళ్ళని అడిగి లేదా వాళ్ళు చెప్పినవి వేసుకుంటూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే అవి మన పాలిట శాపాలు అని డాక్టర్లు చెబుతున్నారు. మూత్రపిండాలను నాశనం చేస్తాయని అంటున్నారు. 

మూత్రపిండాలు పాడైపోయి కొంతమంది డయాలసిస్ చేసుకుంటుంటే కొంతమంది మూత్రపిండాల మార్పిడి చేయించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా షుగర్ మరియు బిపి ఉంటే కనుక షుగర్ ఉన్న వారికి మూత్ర పిండాలు అనేవి కొద్దిగా ఇబ్బంది కరంగా ఉంటాయి. పూర్తిగా నాశనం అయిపోతాయి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెబుతున్నారు అయితే అటువంటి పెయిన్ కిల్లర్, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ వేసుకుంటే వ్యాక్సిన్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ వికటిస్తుంది. 

అందుకే వ్యాక్సిన్ తీసుకున్న వారం వరకు ఎటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోకూడదు. మరి జ్వరం ఏదైనా వస్తే పారాసెటమాల్, డోలో 650 వేసుకోవచ్చు.గతంలో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, డిస్క్లో ఇబ్బందులకు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా తప్పకుండా వేసుకోవాల్సిన వారు తలనొప్పి వచ్చే చోట పెయిన్ కిల్లర్ బదులు మూవ్, వోలినీ లాంటి క్రీములు వాడండి లేదంటే వేడినీటి కాపడం మార్కెట్లో దొరికే నొప్పి నివారణ స్ప్రేలు వాడుకోవచ్చు. నోటిద్వారా వేసుకునే మందులకు విరామం ఇవ్వటమే మంచిది. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ కూడా తీసుకోవడం మంచిది కాదు.

 ఆ మందులు వేసుకున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకొని ఉంటే బీపీ డౌన్ అవ్వడం, ఆయాసం రావడం,  పల్స్ పెరిగిపోవడం జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కూడా జరగొచ్చు. పొరపాటున అలా జరిగితే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. పారాసిటమాల్ లో కూడా కొన్ని పెయిన్ కిల్లర్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకే అలాంటి టాబ్లెట్స్ వేసుకోకూడదు. పొరపాటున ఒక సారి వేసుకున్న అదే కంటిన్యూ చేయకూడదు. మే 1 నుండి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ధారించింది. రాబోయే రోజుల్లో రోజుకు కు కోటి నుంచి రెండు కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వబడతాయి. అందుకే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. మీకు తెలిసిన సమాచారాన్ని మీ వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేయండి.

 మీరు టీకా వేసుకున్న తర్వాత మాంసాహారం తినొచ్చు ఆల్కహాల్, ధూమపానం చేయరాదు. వ్యసనంగా ఉన్నవారు తక్కువ మొత్తంలో పరవాలేదు. లేంటే గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కనీసం వాటికి వారం రోజులు దూరంగా ఉండాలి. శృంగారంలో పాల్గొనడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. టీకా తీసుకోవడం వలన అందరికీ  ప్రమాదం లేదు. కొంతమందిలో తలనొప్పి, కొద్దిపాటి జ్వరం , చెయ్యి నొప్పి ఉంటాయి. అవి కూడా పారాసెటమాల్, డోలో వేసుకోవడం వలన తగ్గిపోతాయి. వాటికి భయపడి వ్యాక్సిన్ వేసుకోకపోతే కరోనా బారిన పడే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని వారాల తర్వాత వ్యాక్సిన్ పని చేయడం మొదలు పెడుతుంది. వ్యాక్సిన్ రోగనిరోధకశక్తిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది నేరుగా కరోనాతో పోరాడదు. కనుక సామాజిక దూరం, మాస్క్, శానిటైజర్ వాడకం తప్పనిసరి.

Leave a Comment

error: Content is protected !!