don't do these mistakes after vaccine

క*రోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 పనులు అస్సలు చేయకండి…

క*రోనా ఎంత బాధలుపెట్టిందో అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి భయపడి వలన వాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసారు. అలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక చాలా అపోహలతో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాలేదు. ఎప్పుడైతే వ్యాక్సిన్ అందుబాటులో లేదు అందరూ వ్యాక్సిన్ కోసం కంగారుపడటం మొదలు పెట్టారు. అప్పటికే కొందరు వ్యాక్సిన్ వేయించుకోవడం వారికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో జనంలో అపోహలు తొలగి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు.

 ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యక్తి అందుబాటులో లేకపోయినా ముందుగా వ్యాక్సింగ్ చేయించుకున్న వారికి వేస్తున్నారు. కొంతమందికి ఆఫీసుల తరుపున, లేదా తెలిసిన వారివలన వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఇలాంటి వారు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పనులు చేయకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు కానీ,  వెనుక కాని రెండు,రెండు వారాల గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటున్న క*రోనా వ్యాక్సిన్ కొత్తగా తయారు చేసింది. దాని పర్యవసానాలు వేరే వాక్సిన్ తో కలిసినప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అవగాహన లేదు. అందుకే వీలైనంత వరకూ క*రోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత లేదా ముందు 2 వారాలకు అటుఇటుగా ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్లు వేసుకోకూడదు.

 అలాగే టాటూస్ కూడా వేసుకోకూడదు. ఒకవేళ తప్పదు వేసుకోవాలి అంటే మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఎటువంటి వ్యాయామాలు చేయకూడదు. కనీసం వారంరోజులైనా విరామం ఇవ్వడం మంచిది. అందరూ వ్యాయామం మంచిది అనుకుంటారు. కానీ అన్ని సమయాల్లో కాదు కొన్ని సమయాల్లో వ్యాయామం చేయడం ప్రమాదకరం కూడా కావచ్చు. వాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలో కొన్ని రకాల నొప్పులు రావచ్చు. వ్యాయామం ఈ నొప్పులను మరింత ఎక్కువ చేస్తుంది.

 అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత శరీరం హైడ్రేట్ గా ఉండేలా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వ్యాక్సిన్ వేసుకునే వారిలో నోరు ఆరిపోవడం అనేది కనిపిస్తుంది. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలి. వ్యాక్సిన్ చేయించుకున్న అప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ జాగ్రత్త చేసుకోవాలి. ఈ సర్టిఫికెట్ మీ వ్యాక్సిన్ వేయించుకున్నారు అనేందుకు గుర్తు.

 బయటకు వెళ్ళినప్పుడు గాని లేదా ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన వీసా, పాస్పోర్ట్ లకు ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పకుండా అడుగుతున్నారు. అందుకే సర్టిఫికెట్ ని చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ లాగానే జాగ్రత్తగా దాచుకోవాలి. వీటితో పాటు వ్యాక్సిన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి డాక్టర్లు చెప్పిన మందులు మాత్రమే వేసుకోవాలి. సొంత వైద్యం పనికిరాదు. బయటకు వెళ్లాలంటే క*రోనా నిబంధనలు తప్పనిసరి. వేసుకున్న తర్వాత కొన్ని వారాల తరువాత మాత్రమే శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి.

Leave a Comment

error: Content is protected !!