భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఆహారం తీసుకోవడం మనిషికి ప్రధానం. రోజుకు మూడు పూటలా ఆహారం తప్పనిసరి. అవి టిఫిన్ల, అన్నమా, వేరే ఏదైనా పదార్థమా మన ఆర్థిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆహారం తీసుకోవడం మాత్రం తప్పనిసరి. చిన్న పిల్లలు అన్నం తినగానే పెద్దలు అరుస్తూ ఉంటారు అది చేయకు, ఇది చేయకు అని. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనం  కాస్త ఆలోచనలు మనవి అయ్యాక మనం కొన్ని అలవాటు చేసుకుని వాటిని ఫాలో అయిపోతాం. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనది భోజనం చేయగానే చేసే పనులు. అయితే ఇపుడు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు భోజనం తరువాత ఈ పనులు చేయద్దని. అసలు ఆ పనులు ఏంటో ఒకసారి చూద్దామా….!!

◆మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీరడానికి మాత్రమే కాదు, మన శరీరానికి కావలసిన పోషకాలు అయిన విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పీచు మొదలైనవి మన శరీరానికి అందించి మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా. కాబట్టి మనం భోజనం చేయగానే చేసే ఈ పనుల వల్ల చాలా ప్రతికూలతలు జరుగుతాయి. ఇవన్నీ కూడా తక్షణమే ప్రభావం చూపించకపోయినా స్లో పాయిజన్ లాగా మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని  మెల్లిగా దిగజారుస్తాయి. 

◆టిఫిన్, భోజనం ఇలా చేయగానే చాలామందికి కాఫీ లేక టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది ఎంత డేంజర్ అనేది అసలు తెలియదు వాళ్లకు. టీ తాగడం వల్ల మన శరీరంలో ఆమ్లాలు విడుదల అయ్యి అవి ఆహారం తో కలిసి జీర్ణవ్యవస్థను మందగించేలా చేస్తాయి. ఇది క్రమంగా జీర్ణాశయ పనితీరు సామర్థ్యము ను తగ్గిస్తుంది. ఇంకా చాలా మందికి కాఫీ అలవాటు కూడా ఉంటుంది కాఫీ తాగగానే కాఫీలో ఉన్న కెఫిన్ మన రక్తంలో చేరుతుంది. ఇది ఆహారం నుండి ఐరన్ ను గ్రహించకుండా చేస్తుంది. దీనివల్ల మన శరీరానికి ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఎక్కువ.

◆భోజనం చేయగానే చాలామంది నిద్రపోవాలి అనుకుంటారు. ఇది కూడా మంచి పద్దతి కాదు. భోజనం అవ్వగానే నిద్రపోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణమవకుండా అజీర్తి చేస్తుంది. దీని పలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు చురుగ్గా ఉండాల్సిన జీర్ణాశయం నెమ్మదిస్తుంది.

◆తినగానే నడక మంచిదని కొందరి అభిప్రాయం. సాధారణంగా తినగానే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ అటు ఇటు తిరగడం సహజం. అయితే పని పెట్టుకుని మరీ లెక్క వేసుకుని నడక సాగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒకేచోట స్థిరంగా ఎక్కువసేపు కూర్చుండిపోవడం కూడా మనం తిన్న ఆహారంలో ఫ్యాట్ లు ఒకచోట పేరుకుపోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

◆భోజనం అవ్వగానే పండ్లు తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది ప్రమాధకరమైనదని ఎవరికి తెలియదు. మనం తీసుకున్న ఆహారం ఊడించినది అయి ఉంటుంది. పండ్లు తీసుకోవడం వల్ల తాజా మరియు పచ్చి రసాలు మన జీర్ణాశయం ను చేరతాయి. రెండింటికి మధ్య చర్య జరిగి రసాయనాలు పుడతాయి. ఇవి ఆమ్లాలుగా, యసిడ్లుగా రూపాంతరం చెంది ఆహారాన్ని పులిసిపోయేలా చేస్తాయి. దీనివల్ల పోషకాల కథ దేవుడెరుగు ఉన్నవి కూడా లభ్యమవకపోగా, వాంతులు, కడుపులో వికారం లాంటి సమస్యలకు దారితీస్తాయి.

◆చాలామందికి భోజనానికి ముందు స్నానం చేసే అలవాటు ఉంటుంది. స్నానం అవ్వగానే భోజనం చేసి  హాయిగా నిద్రపోవాలి అనుకుంటారు. అయితే కొంతమంది భోజనం చేసిన తరువాత స్నానం చేస్తుంటారు. ఇది  ఆరోగ్యానికి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు ముప్పని నిపుణుల అభిపాయం. భోజనం తరువాత స్నానం చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కాళ్ళు చేతులు అంతా పాకి జీర్ణాశయ భాగం లో మాత్రం నెమ్మదిస్తుంది. అందుకే భోజనం తరువాత స్నానం వద్దంటారు పెద్దలు.

చివరగా…..

భోజనం తరువాత ప్రయాణం, వ్యాయామం, బరువులు ఎత్తడం, ఇంట్లో ఎక్కువ పనులు చేయడం వంటి శారీరక దృఢత్వం మీద ప్రభావం చూపించే వాటికి దూరం గా ఉండాలి. లేకపోతే తిన్న ఆహారం పోషకాలు అందకపోగా అవి నిర్వీర్యమైపోయి, జీర్ణాశయం  మీద ప్రతికూల ప్రభావం చూపించి ఆరోగ్యాన్ని నష్టపరిచే విధంగా తయారవుతాయి

Leave a Comment

error: Content is protected !!