dont do these things after vaccination

వాక్సిన్ వేయించుకున్నవారు ఈ తప్పులు అసలు చేయకండి చాలా ప్రమాదకరం

మన ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో క*రోనా మహమ్మారి కి సంబంధించిన వ్యాక్సిన్లు చాలామంది తీసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పనులు చేయాలి అనే సూచనలు చాలా అవసరం. మామూలుగా ఏదైనా నొప్పి రాగానే ఏదో ఒక పెయిన్ కిల్లర్ పేరు చెప్పి మందులషాపువాళ్ళని అడిగి లేదా వాళ్ళు చెప్పిన మందులు వేసుకుంటూ ఉంటారు. ఇది కిడ్నీలకు ప్రమాదం  అని డాక్టర్లు చెబుతున్నారు. షుగర్ మరియు బీపీ ఉంటే కనుక షుగర్ ఉన్న వారికి మూత్ర పిండాల సమస్య  కొద్దిగా ఇబ్బంది కరంగా ఉంటాయి. 

ఎటువంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు అయినా  వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోకూడదు. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల అది వికటిస్తుంది. అందుకని వ్యాక్సిన్ తీసుకున్నవారు నెలవరకు కూడా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఏమైనా నొప్పులు వస్తే పారాసిటమాల్, డోలో 650  వేసుకోవచ్చు. చాలామంది గతంలో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి ప్రాబ్లమ్స్కి వాడే మందులు మానేసి నొప్పి నివారణ స్ప్రేలు వాడుకోవచ్చు. 

అంతేకానీ నోటిద్వారా వేసుకునే మందులు ఇవ్వకపోడమే మంచిది. అంతేకాకుండా ఇంజక్షన్ కూడా తీసుకోవటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ మందులు వేసుకున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే ఆయాసం రావడం, పెరిగిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా పడుకోవచ్చు. అలా జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సహాయం తీసుకోవాలి. అందుకే అలాంటి టాబ్లెట్స్ వేసుకోకూడదు.కొన్ని పారసిటమాల్లో పెయినకిల్లర్ సమ్మేళనాలు ఉంటాయి.ఒకసారి పొరపాటున వేసుకుంటే ఏమీకాదు. అదే పొరపాటు మళ్ళీ చేయకూడదు. 

మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ధారించింది. రాబోయే రోజులలో అందరికీ వాక్సిన్లు ఇవ్వబడతాయి. వారు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం వాటిని వారం రోజులైనా దూరంగా ఉంటే మంచిది టీకాలు తీసుకోవటం వలన అందరికీ ప్రమాదం లేదు. కొంత మందిలో తల నొప్పి, జ్వరం, చేతి నొప్పి ఉంటాయి. పారాసిటమాల్ వేసుకుంటే  అవి కూడా తగ్గిపోతాయి. వాక్సిన్  వేసుకోకపోతే క*రోనా బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని వారాల తర్వాత పని చేయడం మొదలుపెడుతుంది. ఈ వాక్సిన్ రోగనిరోధకశక్తిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది  కనుక సామాజిక దూరం, తగిన జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యం కాపాడుకోవడం అవసరం.

Leave a Comment

error: Content is protected !!