పాలు పుట్టినప్పటి నుంచి ఆహారంగా ఇవ్వబడతాయి. ఇది జంతు సంబంధ ఆహారం. బతికి ఉన్న జంతువుల నుండి తీసుకునే ఆహారంలో హర్మోన్లు, ఎమినో యాసిడ్స్, ఎంజైమ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి పదార్థాలను సరైన టైంకి సరైన పద్థతిలో సరైన ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవాలి. ఎందుకంటే పులిసిన లేదా జంతు సంబంధ పదార్థాలు వలన శరీరంలో కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. ఒక గ్లాసు పాలు ఒక పూర్తి ప్లేట్ ఆహారంతో సమానం. రోజూ పాలు, పాల సంబంధ పదార్థాలు తీసుకోనివారు నలభై సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. అందుకే పిల్లలకు పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అనేక పోషకవిలువలు కలిగిన పాలను తాగే పద్థతి తెలుసుకుందాం.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కొంతమంది పాలు తాగడానికి ముందు, తాగిన తర్వాత ఆహరం తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.పాలు పూర్తి ఆహరంతో సమానం కనుక త్వరగా జీర్ణమవవు. భోజనం చేసిన తర్వాత రెండు గంటల వరకూ పాలు తాగకూడదు.అలాగే పుల్లటి పండ్లు, ఉప్పు పదార్థాలు తినకూడదు. అలాగే ప్రైలు, ఉప్పుకారం కలిసిన స్నాక్ ఐటమ్స్ తో కలసి జీర్ణమవదు. అలాగే రసాయన క్రియలకు కారణమవుతాయి. దీనివలన కడుపుబ్బరం, గడబిడకి కారణమవుతాయి. అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తిని కలిగిస్తాయి.
కడుపు, జీర్ణాశయం, మూత్రాశయం, చర్మసమస్యలు రావడానికి పాలు తప్పుడు పద్థతులలో తాగడమె కారణం కావచ్చు.ఉల్లిపాయ, వంకాయ పాల గుణాలకు విరుద్ధంగా ఉంటాయి. ఒకవేళ తాగాల్సి వస్తే రెండు గంటలు విరామం ఇవ్వండి. చేపలు తీన్న తర్వాత పాలు తాగితే బొల్లి వచ్చే ప్రమాదం వస్తుందని అంటారు. మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగితే రెండింటిలోనూ ఉండే ప్రొటీన్లను జీర్ణంచేయడంలో జీర్ణాశయం విఫలం అవుతుంది.
పాలు పెరుగు కలిపి తీసుకోకూడదు. పాలు పెరుగు వెంటవెంటనే తీసుకుంటే పాలు కూడా పెరుగుగా మారుతుందీ. కడుపులో గడబిడ వస్తుంది.
పాలను రాత్రిపూట తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంట్లో త్రిప్టోఫైన్ అనే రసాయనం మెదడు మరియు శరీరాన్ని శాంతపరిచి మంచినిద్ర పడుతుంది. రాత్రిపూట తీసుకునే చివరి ఆహరంకనుక శరీరానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయాన్నే కడుపు పూర్తిగా శుభ్రపడుతుంది. రాత్రుళ్ళు తక్కువగా భోజనం చేయకండి. అధిక బరువు ఉన్నవారు ఆవుపాలు తీసుకోవాలి.నీరసంగా, బలహీనంగా ఉన్నవారు గేదెపాలు తాగాలి. పాలు క్రమంతప్పకుండా తీసుకుంటుంటే ఎముకలు, జుట్టు,చర్మంకి మంచిది. బలంగా మరియు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆవుపాలలోఅనేక పోషకాలు ఉంటాయి.బర్రెపాలకంటే ఆవుపాలు ఆరోగ్యానికి మంచిది. పంచదార కంటే బెల్లం పటికబెల్లం తో కలిపి తాగడంవలన త్వరగా జీర్ణమవుతాయీ.మరియు పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.