మనిషి శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలంటే మన జీవక్రియ పద్ధతిలో జరగాలి. కానీ ఇప్పుడున్న జీవనవిధానంలో సమయానికి తిండి తినలేకపోతున్నాం. తినేవాటిలో కూడా అనారోగ్య కారకమే ఎక్కువగా ఉంటున్నాయి. జంక్ ఫుడ్, మైదాలు నూనెలు తినడం ఎక్కువయి అజీర్తి, కడుపుబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయాన్నే ఏదొకటి తిని బయటపడాలనే తొందరలో ఏం తింటున్నారో గమనించడమే లేదు. రాత్రంతా ఏమీ తినకుండా ఉండడం వలన మనం తినే ఆహారం త్వరగా జీర్ణమయి పోషకాలను అందించేదిగా ఉండాలి. హాని కలిగించేదిగా ఉండకూడదు. అల్పాహారంగా మనం తీసుకునే ఆహారం వలన శరీరంలో జరిగే మార్పులు గురించి తెలుసుకుందాం రండి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ఖాళీ కడుపుతో పళ్ళరసాలు తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో పళ్ళ రసాలు తీసుకోవడం వలన క్లోమంపై ప్రభావం పడుతుంది. క్లోమం జీర్ణరసాలు తయారు చేస్తుంది. పళ్ళరసాలలో ఉండే ప్రక్టోజ్ మన జీర్ణాశయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఏదైనా తిన్న తర్వాత పళ్ళ రసాలను తీసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే పండ్లు తినేవాళ్ళు సిట్రస్ పండ్లు తినకుండా ఉంటే మంచిది. ఇవి ఉదరంలో యాసిడ్స్ తయారుచేసి గ్యాస్ట్రిక్, ఎసిడిటీకి కారణమవుతాయి. ఇందులో ఉండే ప్రక్టోజ్ జీర్ణవ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. యాపిల్, అరటిపండు తినవచ్చు. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగకూడదు. టీ,కాఫీలలో ఎసిడిటీ కలిగించే కారకాలు ఉంటాయి.చాలామంది పెరుగు, యోగర్ట్ పాల సంబంధ పదార్థాలు తింటారు. కానీ ఇలా పులియబెట్టే పదార్థాలు తినకపోవడం మంచిది.
చాలా మంది డైట్లో భాగంగా వెజిటబుల్ సలాడ్ తింటుంటారు. ఉదయాన్నే తినడం కంటే మధ్యాహ్న భోజనం తర్వాత సలాడ్ తినడం మంచిది. ఖాళీ కడుపుతో తినడంవలన అందులోనీ ఫైబర్ వలన కడుపుపై అధికభారం పడుతుంది. దీనివలన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే టమాటాలోని క్రానిక్ యాసిడ్ కడుపులో వికారం పెంచుతుంది. అందుకే పైన చెప్పిన పదార్థాలు ఖాళీ కడుపుతో తినడం మానేసి ఏదైనా తిన్న తర్వాత లేదా భోజనం తర్వాత తినడం మంచిది. యాపిల్, పుచ్చకాయ లాంటి పండ్లను తినవచ్చు. మీకు నచ్చిన ఆరోగ్యకరమైన పదార్థాలు వదలకుండా కొంత సేపటికి వాయిదా వేసుకోవడం మంచిది. తెలిసింది కదా ఇకపై ఆహారంపై నిఘా పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.