dont keep these items in bedroom

పడకగదిలో పర్సనల్ టైమ్ తృప్తిగా ఆస్వాదించాలంటే వీటిని మాత్రం ఉంచకండి

వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసేవి చాలా ఉంటాయి. ఇంటిని మేనేజ్ చేయడంలో మహిళలదే ఎక్కువ బాధ్యత.  ఏ ఇంటికి వెళ్లిన హలంతా చక్కగా అలంకరించి ఉంటారు. ఇంటి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు ఎన్ని ఉన్నా వాళ్ళ మధ్య ఆశించిన తృప్తి వారి పర్సనల్ లైఫ్ లో లేకపోవచ్చు. దీనికి కారణం వారి మధ్య సఖ్యత లేకపోవడం ఎంత మాత్రం కాదు. వారి పర్సనల్ అయిన పడక గదిని వాళ్ళు ఎలా ఉంచుకున్నారనే దానిపైన వారి సంతోషం ఆధారపడి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అయితే పడక గది ఎలా ఉంటే సంతోషంగా తమ పర్సనల్ టైమ్ ను స్పెండ్ చేస్తారో ఒక్కసారి చూద్దాం.

◆ప్రతి ఇంట్లో హాలు అందంగా ఉంటే ఇల్లంతా అందంగా ఉన్నట్టు కాదు. వచ్చి పోయే అతిథులకు ఇల్లు అందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఇంట్లోనే ఉండే వాళ్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందా తమ ఇల్లు అని ఎపుడైనా ఆలోచిస్తారా?? 

◆హాలుని చక్కగా అలంకరించి హాలులో అవసరం లేని వస్తువులను తీసుకెళ్లి పడక గదిలో వేస్తుంటారు పడక గదిలోకి రాకూడని వ్యక్తుల్లానే అనవసరమైన వస్తువులు కూడా అన్న విషయం గుర్తించుకోవాలి.

◆మంచి వాల్ మ్యాపులు, పెయింటింగ్స్ వంటివి హాల్ లో పెట్టేసి గదిలో మాత్రం చనిపోయిన తాతల ఫోటోలు లాంటివి పెట్టుకుంటుంటారు కొందరు. మరికొందరు దేవుడి ఫోటోలు కూడా పెడుతుంటారు. పడక గది ఆహ్లాదంగా ఉండాలి దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందెలా ఉండాలి.

◆బట్టలు విషయంలోకి వస్తే ఇంట్లో ఉన్న అందరివి పాతబట్టలు అన్ని ఒక మూలన కుక్కేసి ఉంటారు. వీటివల్ల గదిలో ఉండాల్సిన ఉత్తేజం తగ్గుతుంది

◆అరుధైనవనే పేరుతో పాతకాలపు వస్తువులను పడకగదిలో ఉంచడం వల్ల గది అందం పోతుంది.

◆వృత్తి సంబంధమైన పుస్తకాలు, ఫైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి పడక గదిలోకి తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. ప్రస్తుతం మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిస్తున్న వస్తువులు ఇవే. వీటిని గదిలోకి తీసుకురాకపోవడం వల్ల ఇద్దరి మధ్య సమయం పెరుగుతుంది.

◆పడక గది అంటేనే పర్సనల్ దాన్ని పర్సనల్ గానే ఉంచుకోవడం ఉత్తమం. వీలైనంతవరకు ఎవరిని రానివ్వకుండా ఇద్దరి అభిరుచికి తగ్గట్టు ఉంచుకుంటే బాగుంటుంది

చివరగా…..

పర్సనల్ టైమ్ ను తృప్తిగా ఆస్వాదించాలంటే పైన చెప్పుకున్నవాటితో పాటు ఒకరికి నచ్చని పని మరొకరు చేయకపోవడం  ముఖ్యం. ఇంకో విషయం ఏమిటంటే బయట విషయాలకు ఇద్దరి మధ్య ఇగో లు, పంతాలు, పట్టింపులు ఉండకూడదు. అలా ఉంటే మీ పర్సనల్ లైఫ్ పర్సనల్ టైమ్ హ్యాపీ హ్యాపీ.

Leave a Comment

error: Content is protected !!