ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అంటే మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ మన అవయవాల్లోనే కణజాలాలని పరాయి కణాలుగా భావించి పాడు చేస్తుంది. మన శరీరంలో రక్షణ వ్యవస్థ దాడి చేసే సమయంలో CRP ఎక్కువై పోతుంది. C రియాక్టివ్ ప్రోటీన్. ఇది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు నెంబర్ పెరిగే కొద్దీ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి CRP రేటు పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మనం మందులు, యాంటీ బయోటిక్స్ వాడతాము. ఈ CRP నీ నాచురల్ గా తగ్గించడానికి బ్రెజిల్ నట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
దీనిని సైంటిఫిక్ ఎలా నిరూపించారు, అంటే మూడు గ్రూపులుగా 30 మందిని తీసుకున్నారు. ఇలా CRP ఎక్కువ ఉన్నవారిని తీసుకున్నారు. ఫస్ట్ గ్రూప్ 10 మందికి బ్రెజిల్ నట్ ని 20 గ్రాములు చొప్పున ఇచ్చారు. రెండో గ్రూప్ 10 మందికి ఈ బ్రెజిల్ నట్ ని 50 గ్రాములు చొప్పున తినిపించారు. ఇక మూడవ గ్రూప్ 10 మందికి జీడిపప్పులు 20 గ్రాములు తినిపించారు. ఇలా 30 రోజులు పాటు తినిపించారు. బ్రెజిల్ నట్ తిన్న ఫస్ట్ గ్రూప్ కి 25 నుండి 30% ఇన్ఫ్లమేషన్ తగ్గింది. దీనివల్ల CRP 35,% తగ్గిపోయింది. ఈ 20 గ్రాములు సరిపోతుందా లేదా అని రెండో గ్రూపు వారు 50 గ్రాములు ఇచ్చారు.
వీళ్లు ఎక్కువ తిన్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఎక్కువ తగ్గిందా అని చూస్తే 20 గ్రాములు తిన్నవాళ్ళకి ఎంత తగ్గిందో వీళ్ళకి అంతే తగ్గింది. కాబట్టి 20 గ్రాముల కంటే ఎక్కువేమీ తిననవసరం లేదు. మరి జీడిపప్పు పెట్టిన వారికి ఈ CRP 5% తగ్గింది. ఈ పరిశోధన 2013 వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ శాంతా మేరియా బ్రెజిల్ దేశం వారు పరిశోధన చేసి ఈ బ్రెజిల్ నట్ ఇంత బాగా పనిచేస్తుందని తెలియచేశారు. కాబట్టి బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఉన్న, అన్ని రకాల జబ్బులకు, దీర్ఘ రోగాలకి ఈ బ్రెజిల్ నట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రెజిల్ నట్ ని నానబెట్టుకుని తింటే బాగుంటుంది. ఇలా చేస్తే ఈజీగా డైజేషన్ అవుతుంది.
హెవీ ఫ్యాట్ కాబట్టి 12 గంటలు నానబెట్టాలి. అలా తినలేకపోతే ద్వారగా వేయించి పొడి చేసుకుని పాలలో కలిపి తాగొచ్చు. 20 గ్రాముల బ్రెజిల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.