మనం వండుకొనేటప్పుడు ఏడు రకాల రుచుల్ని వేసి పదార్థాల్ని రుచికరంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ ఏడు రకాలు ఉప్పు,నూనె, నెయ్యి, తీపి , కారం,మసాలా, పులుపు. ఉప్పు, కారం మొదట ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. ఇవి రుచులకు అమ్మ, నాన్న వంటివి. మిగతావన్నీ వీటి ఫ్యామిలీగా భావించవచ్చును. కారం, పులుపు,మసాలాలు అన్నీ ఉన్నాయి కానీ ఉప్పు, నూనె వాడకం ఎక్కువగా ఉంటుంది. వాటి వాడకం ఎంత తగ్గితే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఉప్పు, నూనె పూర్తిగా మానకపోయినా వీలైనంత తగ్గించడం మంచిది.
ఉప్పు, నూనె తగ్గించడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి రోజులో తినే ఉడికించిన ఆహారం ఒకసారికే పరిమితం చేయండి. ఉడికించిన ఆహారాన్ని తినే సమయంరోజులో ఒక్కసారి మాత్రమే అవుతుంది. మూడు సార్లు తింటున్నాం.మూడు సార్లలో ఉడికించిన ఆహారం ఒకసారి అయినప్పుడు ఉప్పు,నూనె కూడా ఒకసారి పరిమితమవుతాయి కదా. మిగతా రెండు సార్లు ఉండదు కదా. సాధ్యమైనంతవరకు మొలకలు, ఫ్రూట్స్ తినాలి. మధ్యాహ్నం వండిన ఆహారం, రాత్రులు ఫ్రూట్స్ వరకు పరిమితం కావచ్చు. శని ఆదివారాలు కావాలంటే స్పెషల్ తినొచ్చు. అది కూడా ఒకసారికే పరిమితం చేసుకోవాలి.
ఉదయం సాయంత్రం నాచురల్ ఫుడ్స్ అంటే పళ్ళు పళ్ళరసాలు తీసుకోవడం మంచిది. ఇవి ఆహారంలో ఉప్పు, నూనె తగ్గడానికి సహకరిస్తాయి. ఉప్పు, నూనెలు తగ్గించడానికి మరో మార్గం వండేటప్పుడు ఉప్పు, నూనె కలపకుండా దింపిన తర్వాత ఉప్పు, నూనె కలుపుకోవచ్చు. నూనె కొద్దిగా తాళింపు వేసినట్టు వేయడం వల్ల పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల ఉప్పు, నూనె 90 శాతం తగ్గించవచ్చు. ఇలా తక్కువ నూనె, ఉప్పు వాడకాన్ని అదుపు చేసుకోవచ్చు. ఇలా పైపైన ఉప్పు చల్లడం వల్ల ఉప్పు, నూనె లేకుండా తిన్నామని భావం లేకుండా ఉప్పు తిన్న భావన ఉంటుంది.వాటిని ఎక్కువ లేకుండా తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్త్రీలు కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అనారోగ్యం వచ్చేవరకు ఎదురు చూడకుండా ఇప్పుడే మొదలు పెట్టొచ్చు. ఈ రోజు నుంచి ఇలా ఆహారంలో మార్పులు చేసి మంచి ఆరోగ్యవంతులు కండి.