వేసవి వచ్చేసింది, ఎటు చూసినా కూల్ డ్రింక్ షాపులు కిటకిటలాడతాయి. చల్లచల్లని కూల్ డ్రింక్స్, సోడా తో కలిసి నోటికి, నాలుకకు తగులుతూ అలసిపోయిన ప్రాణానికి హాయిని ఇస్తుంది. అయితే ఇదంతా ఒకవైపే, మరో వైపు చూస్తే ప్రతిరోజు ఈ ఎండ నుండి సేద తీరడానికి తాగే షోడా వల్ల ఆరోగ్యానికి యమా డేంజర్ అనే విషయం తెలియదు చాలా మందికి అందుకే సోడా ఎక్కువ తాగితే తేడా అయిపోద్ది.
ఉబకాయం
సోడా వినియోగం పెరిగేకొద్ది ఉబకాయం కూడా పెరుగుతుంది. సోడాను రోజూ తాగేవారిలో సాధారణంగా
శీతల పానీయాలు కోసమే వినియోగిస్తూ ఉంటారు. మనం తీసుకునే ఈ పానీయల్లో వినియోగించే చెక్కెరలోని తీపిదనాన్ని షోడా దాదాపు 200 నుండి 600 రెట్లు తీపిగా మార్చేస్తుంది. దీనివల్ల శరీరంలోకి చెక్కర స్థాయిలు అధికంగా వెళ్లడం వల్ల ఉబకాయం మరియు మధుమేహం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది తీపి కలపకపోయినా మసాలా షోడా వంటి వాటిని తాగుతూ వాటివల్ల ఎలాంటి చెక్కెరలు, క్యాలరీలు శరీరంలోకి వెళ్లడం లేదనుకుని పొరపడుతూ ఉంటారు. సాధారణ షోడా కూడా బరువు పెంచడంలో దోహాధం చేస్తుంది. మరొక విషయం ఏమిటంటే షోడా తాగని వారికంటే షొడాను రోజూ తాగేవారిలో మూడురెట్లు కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
విటమిన్ లోపం
కార్బోనేటేడ్ తో కూడిన షోడాలలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది ఇది శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. అలాగే సోడా విటమిన్ డి ని శరీరం గ్రహించకుండా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడటం, బోలు ఎముకల వ్యాధి మొదలైన ఎముకలకు సంబందించిన సమస్యలు మాత్రమే కాకుండా రక్తపోటు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దంత క్షయం
రోజూ సోడా తాగడం వల్ల అధిక చక్కెర మరియు ఫ్రక్టోజ్ ల వల్ల చిగుళ్లు బలహీనం అవుతాయి. అలాగే పళ్ళు దృఢత్వాన్ని కోల్పోతాయి. సోడా అధిక ఆమ్లత్వం కలిగి ఉండటం వల్ల పంటి మీది ఎనామెల్ కోతకు గురవుతుంది. సోడా తాగినప్పుడు వాటిలోని చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాతో కలిసి ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లం దంతాలపై దాడి చేయడం వల్ల దంతాలు దెబ్బతినడం మొదలుపెడతాయి.
దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులు
రోజూ సోడా ను తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోయి నడుము బాగంలో కొవ్వులు ఏర్పడటం, అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఏర్పడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా సోడా వినియోగం వల్ల మహిళలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
కెఫిన్ స్థాయిల ప్రభావం
కెఫిన్ కలిగి ఉన్న శీతల పానీయాలు ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. వీటిలో ఉండే కెఫిన్ స్థాయి అధికంగా ఉంటుంది. సాధారణంగా పిల్లలు కాఫీ, మరియు టీ లకు దూరంగా ఉంటారు అయితే ఈ కెఫిన్ భాగమైన సోడా తీసుకోవడం వల్ల పిల్లల్లో పరోక్షంగా కాఫీ, టీల మోతాదులో కెఫిన్ శరీరంలోకి వెళుతుంది.
కిడ్నీ సమస్యలు
ప్రతిరోజు సోడా తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా అవుతాయి. మూత్రపిండాలలో రాళ్లు సమస్యతో బాధపడేవాళ్ళు సోడాకు దూరం ఉండటమే ఉత్తమం. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే సోడా వల్ల తలనొప్పి, అలసట, ఆసక్తి తగ్గడం, నిరాశ చెందడం, మానసిక స్థితిని ప్రభావితం చేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
క్యాన్సర్
క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనమైన బెంజీన్ శీతల పానీయాలలో అధికమోతాదులో ఉంటుంది. బెంజాయిక్ ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం ఇనుము లేదా రాగి వంటి లోహాలతో సంబంధంలోకి వచ్చినప్పుడు బెంజీన్ ఏర్పడుతుంది. ఇది తరువాత రసాయన ప్రతిచర్యను చర్యను జరిపి క్యాన్సర్ హానికర స్తాయిగా మారుతుంది. కాబట్టి క్యాన్సర్ కలిగించే కణాలను సోడా తీసుకోవడం వల్ల అభివృద్ధి చేసినట్టు అవుతుంది.
చివరగా….
ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి, తాజాదనం కోసం సోడా ను తీసుకునేవారు అపుడపుడు తీసుకోవడం ఉత్తమం. లేకపోతే అనారోగ్యానికి దగ్గరైపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.