drawbacks of waxing at home

వాక్సింగ్ చేయిస్తున్నారా ఒకసారి ఇది తెలుసుకోండి!!

సౌందర్య స్పృహ ఉన్న ప్రతి  ఒక్కరికి  అవాంఛిత రొమాలను తొలగించుకునే పద్దతి తప్పకుండా తెల్సి ఉంటుంది. వీటిలో త్రేడ్డింగ్, వాక్సింగ్ అని రెండు రకాలు  ఉన్నా చాలామంది వాక్సింగ్ వైపు మొగ్గుచూపుతారు. వాక్సింగ్ చర్మాన్ని నునుపుగా ఉంచుతూ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. అయితే అందం పేరుతో అందరూ పాటించే ఈ వాక్సింగ్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి అవేంటో ప్రతి మహిళా తెలుసుకోవాల్సిందే. 

 చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది

 వాక్సింగ్ వెంట్రుకలను నేరుగా లోపలి పోరల నుండి తొలగిస్తుంది, దీని ఫలితాలు షేవింగ్ కంటే చాలా ఎక్కువసేపు ఉంటాయి.  వాక్సింగ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది  ఫలితంగా చర్మం సున్నితంగా తయారవుతుంది. 

 చర్మాన్ని కందిపోయేలా చేస్తుంది

 వాక్సింగ్ యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావం ఎరుపు.  వేడిగా ఉన్న  మైనపు మిశ్రమాన్ని చర్మంపై పూయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. ఇది కొన్ని గంటల ఙన్ది రోజుల వరకు కూడా ఉండవచ్చు. చర్మ స్వభావాన్ని బట్టి తీవ్రత ఉంటుంది.  అయితే ఇది చర్మాన్ని క్రమంగా సున్నితంగా మారుస్తుంది.  

మండించే స్వభావాన్ని కలిగి ఉంటుంది

 వాక్సింగ్ తరువాత కనిపించే మరొక సమస్య మంట.  వాక్సింగ్ మిశ్రమాన్ని చర్మానికి పట్టించిన తరువాత దాన్ని గట్టిగా లాగడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కొన్ని సార్లు ఇది చర్మం వాపుకు దారితీస్తుంది. 

 అంటువ్యాధులు

వాక్సింగ్ ప్రక్రియలో  ఉపయోగించే ఉత్పత్తులు అపరిశుభ్రంగా ఉండటం లేదా బాక్టీరియా వంటివి సంక్రమించినవి వాడటం, లేదా ఒకరికి ఉపయోగించిన తరువాత ఎలాంటి శుభ్రత పాటించకుండా మరొకరికి వాక్సింగ్ చేయడం వంటి తప్పిదాల కారణంగా అంటువ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది  డయాబెటిస్ ఉన్నవారికి దీనివల్ల పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ లను చాలా తొందరగా వ్యాప్తి చేస్తుంది. 

 గాయాలు

వాక్సింగ్ ను అనుభవం ఉన్న నిపుణుల దగ్గర చేయించుకోవాలి, లేకపోతే వాక్స్ ను అప్లై చేయడం మరియు లాగడంలో తప్పులు దొర్లి చర్మం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పగుళ్లు, చర్మం చీలడం రక్తం రావడం వంటివి జరిగి గాయాలకు దారితీసే వికాసం ఉంటుంది.

రాషెస్

 చర్మంను గట్టిగా బంధించడం మరియు బలవంతంగా లాగడం చర్మం నొప్పికి గురయ్యి అది క్రమంగా మంట, దురదలకు దారి తీసి రాషెస్ గా మార్పు చెందే అవకాశం ఉంటుంది. అందుకే వాక్సింగ్ కు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. 

 చర్మం కాలిపోవచ్చు. 

కొన్నిసార్లు వాక్సింగ్ మిశ్రమాన్ని చర్మానికి పూసేటపుడు ఉష్ణోగ్రతను సరిచూడకుండా నేరుగా అప్లై చేయడం వల్ల సున్నితమైన చర్మం తొందరగా కాలిపోయి బాధకు గురిచేస్తుంది. ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం.  

 చివరగా…….

వాక్సింగ్ అనేది సౌందర్య స్పృహతో చేయించుకునే ప్రక్రియ అయినా తగినంత జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా నిపుణుల దగ్గరే వాక్సింగ్ చేయించుకోవడం, తమ శరీర తత్వాన్ని బట్టి వాక్సింగ్ చేయించుకోవడం మరవకండి.

Leave a Comment

error: Content is protected !!