drdo 2g drug how it will work

ఈ మందు నిజంగానే క*రోనా తగ్గిస్తుందా

ఈ రోజుల్లో మనం ఒక కామన్ మెడిసన్ 2dg గురించి చాలా వింటున్నాం.  ఈ మెడిసిన్ అంటే ఏంటి ఇంత వరకు క్యూర్ అవుతుంది. మెడిసిన్ ఎవరు వాడొచ్చు,ఎలా వాడాలి అని దీని గురించి డీటెయిల్స్  మాట్లాడుకుందాం.  2dg అంటే టూ డి ఆక్సి డి గ్లూకోస్.  దీనిని 8 మే నా డ్రగ్ కంట్రోల్ అప్రూవల్ చేశారు. ఈ మందు మనకు ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

 నార్మల్ గా ఒక వైరస్ బాడీ లోకి వెళ్ళిన తర్వాత కోవిడ్ వైరస్ అయిన ఏ వైరసైనా బాడీ లోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి చెందడానికి గ్లూకోస్ అనేది చాలా అవసరం. అది అభివృద్ధి చెందడానికి గ్లూకోజ్ కావాలి. 2డిజి ఏం చేస్తుందంటే శరీరంలో గ్లూకోస్ తగ్గించి అంటే గ్లూకోస్ ఇస్ పాత్ వే అని ఉంటుంది. దానిని తగ్గించేసి వైరస్ అభివృద్ధి చెందకుండా ఆపుతుంది. రక్షణ కవచంలా ఉంటుంది. 

శరీరంలో వైరస్ తొందరగా అభివృద్ధి చెందకపోతే దాని వలన వచ్చే ప్రభావం తగ్గుతుంది. శరీరంలో ఈ మందు వలన  తీవ్రమైన ప్రభావాలు లేకుండా అడ్డుకోగలిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ మీద ఆధారపడిన వ్యక్తులలో కూడా ఈ మందు వైరస్ అభివృద్ధి అడ్డుకొని ఆక్సిజన్ నేరుగా తయారయ్యేలా ప్రోత్సహించింది. హాస్పిటల్ లో అడ్మిషన్ కూడా తగ్గుతున్నట్టు చెబుతున్నారు. 

ఇది చాలా ముఖ్యమైన మందు ఈ మధ్యకాలంలో ఏర్పడిన పరిస్థితి వలన. ఈ మందు ఎవరు ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బాగా తీవ్రమైన లక్షణాలు ఉన్న క*రోనా రోగుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది పౌడర్ రూపంలో లభిస్తుంది. ఇది రోజుకు రెండు సార్లు నీటిలో కలుపుకొని తీసుకోవాలి. 

5 నుండి 7 రోజుల వరకూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు నచ్చినట్టు వాడడం కాకుండా డాక్టర్ చెప్పినట్లు మాత్రమే వాడాలి. అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం డాక్టర్ చూచినప్పుడు మాత్రమే ఈ మందులు వాడవలసి ఉంటుంది. ఈ మందు వల్ల ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలలో.

Leave a Comment

error: Content is protected !!