dried-ginger-ayurveda-benefits

శొంఠి ఇంట్లో…మేలు ఒంట్లో..

శొంఠి లేని కషాయము లేదు కదరా బిడ్డా… అన్నాడంటా ఓ పెద్దాయన. మరి అతనికి శొంఠి గురించి ఎంతో తెలుసో గాని మంచి మాటే అన్నాడు. పచ్చి అల్లంని మనం అల్లం-వెల్లుల్లి పేస్టు లో ఎలాగూ వాడుతుంటాం. కొందరు వారి రోజువారి తాగే చాయిలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే… శొంఠి (ఎండబెట్టి పొడి చేసిన అల్లం) రూపం లో తీసుకుంటే అది మరింత మంచి చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్పకనే చెప్తుంది.

మారిన జీవన శైలితో మనం అనేక జీర్ణకోస, ఉదర సమస్యలను ఎదుర్కుంటున్నాము. శొంఠి పొడి ఒక చక్కన పరిష్కారము.

  • భోజన సమయానికి అర్ధగంట ముందు రెండు గ్రాముల శొంఠి పొడిని కొంచెం వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే, అజీర్ణం, మలబద్ధకం, ఉదర సమస్యలు నుంచి బయటపడొచ్చు.
  • మహిళలు ఋతుక్రమ సమయంలో మొదటి మూడు రోజులు తీవ్రమైన నొప్పిని ఎదుర్కుంటారు. ఒక అధ్యయనం ప్రకారం, మహిళలు రోజు ఒక గ్రాము శొంఠి పొడిని నీళ్ళలో కలిపి తాగితే, నొప్పి చాలావరకు తగ్గుతుందని తేలింది.
  • బ్లడ్ షుగర్ వ్యాధిగ్రస్తులు పరగడుపునే రెండు గ్రాముల శొంఠి, చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
  • ఇక శరీరంలో వాపు సంబంధిత వ్యాధులతో, కీళ్ళ నొపులతో, మరియు వేళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారికి శొంఠి దివ్య ఔషధం.
  • వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గులకు శొంఠి తో చేసే కషాయం మంచి పరిష్కారం.
  • ముఖ్యంగా చిన్నపిల్లలో కనిపించే గ్యాస్ సమస్యను శొంఠి పూర్తిగా నివారిస్తుంది. మనం రోజు వాడే మసాలల్లో కాస్త శొంఠి పొడిని కలిపి వంట చేసుకుంటే, క్రమేపి గ్యాస్ సమస్య తగ్గుతుంది.
  • ఫాస్ట్ ఫుడ్ అంటూ ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహరం వైపు యువత మొగ్గు చూపడం, కంప్యుటర్ల ముందు గంటల తరబడి ఉద్యోగ రీత్య కూర్చోవడంతో జీవనక్రియ మందగిస్తుంది. దీంతో బరువు పెరుగుతూ, ఊబకాయం బారిన పడే అవకాసం కూడా ఉంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే, శొంఠి ని మన రోజువారి ఆహారం లో తీసుకోవాలి.
  • గుండె సంబంధిత వ్యాధులు రావడానికి మనం తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ ముఖ్య కారణం. వీటిని అదుపు లో ఉంచడానికి రోజు 3 గ్రాములు శొంఠి తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. 

Leave a Comment

error: Content is protected !!