స్త్రీలలో హార్మోనల్ బేలన్స్ వలన పీరియడ్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామందికి పీరియడ్స్ లో ఉండే లక్షణాలు పది రోజులకు ముందు నుండి ఉండడం నొప్పులు, చిరాకు అనిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాలంలో ఎవరికైనా సరైన సమయానికి నెలసరి రావడం మూడు లేదా నాలుగు రోజుల పాటు బ్లీడింగ్ సరైన మోతాదులో అవ్వడం, నొప్పిలేకుండా నెలసరి పూర్తవడం వంటివి జరుగుతుంటే వారు అదృష్టవంతులు అని చెప్పాలి. ఇప్పట్లో కొంతమందికి నెలసరి ఆలస్యం అవడం ఒక సాధారణ లక్షణంగా మారిపోయింది.
అలాంటి వారికి నెలసరి సరైన సమయానికి వచ్చే నేచురల్ రెమెడీ మన ఇంట్లోనే ఉండే వాముతో చేసుకోవచ్చు. వాము అనగానే మనందరికీ పచ్చి మిర్చి బజ్జీలలో మిర్చి మధ్యలో పెట్టే వాము గుర్తొస్తుంది. శనగ పిండితో చేసే బజ్జీలు లాంటివి తినడం వల్ల గ్యాస్ సమస్య, అజీర్తి సమస్య వస్తుంది. వీటిని నివారించడానికి మధ్యలో వాము పెట్టేవారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గించడంతో పాటు పీరియడ్స్ సమస్యను నివారించి ఒకటి రెండు రోజుల్లోనే పీరియడ్స్ వచ్చేలా చేయడంలో కూడా వాము చాలా బాగా పనిచేస్తుంది.
వాము కషాయం తీసుకోవడం వల్ల గర్భాశయంలోని కండరాలపై ఒత్తిడి తీసుకువచ్చి వాటిలో కదలికలను పెంచుతుంది. దీనివలన నెలసరి సరైన సమయంలో వస్తాయి. వాము కషాయం నెలసరిలో నొప్పిని తగ్గించడంతో పాటు శరీరంలో ఆక్సిటోసిన్ అనే రసాయనాన్ని పెంచుతుంది. ఆక్సిటోసిన్ యుటేరస్ ని శుభ్రం చేయడానికి పీరియడ్స్ సమస్య నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో కండరాలకు విశ్రాంతి కలిగించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నెలసరి నొప్పితో పాటు ఉ అజీర్తి వలన వచ్చే నొప్పి, గ్యాస్ తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది వాము నమిలి ఆ రసాన్ని మింగి నొప్పి, గ్యాస్ నుండి ఉపశమనం పొందుతారు. అధిక రక్తస్రావం ఉన్నవారు ఈ వాము డికాక్షన్ తీసుకోకపోవడం మంచిది. ఇది రక్తస్రావాన్ని అధికం చేస్తుంది. ఒక నాలుగు గ్లాసుల నీటిలో నాలుగు స్పూన్ల వాము వేసి వాటిని ఒక గ్లాసు అయ్యేంతవరకూ మరిగించాలి. తర్వాత ఆ నీటిని టీస్పూన్ తేనెతో లేదా మామూలుగా తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెచ్చని కషాయాన్ని తీసుకోండి. అజ్వైన్ మీ రుతు చక్రాన్ని ప్రేరేపించడమే కాకుండా రుతుక్రమంలోని నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.