drink to reduce belly fat in 4 days

కేవలం పొట్ట పైన ఉన్న కొవ్వు మాత్రమే తగ్గాలి అనుకుంటే ఈ ఫ్రూట్ తినండి చాలు…

మగవారికి ముఖ్యంగా కొవ్వు కణాలు అనేది పొట్ట భాగంలో పెద్ద సైజులో ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు ఉంటాయి. అందువలన బరువు పెరిగినప్పుడు మగవారికి ఎక్కువగా బొజ్జ బాగా పెరుగుతుంది. అదే ఆడవారికి అయితే తొడలు భాగంలో, సిట్ భాగంలో కొవ్వు కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందువలన వారికి ఆ భాగంలో కొవ్వు బాగా పెరుగుతుంది. కొంతమంది స్త్రీలకు ఆ భాగంలో కొవ్వు పెరగడంతో పాటు పొట్ట భాగంలో కూడా కొవ్వు పెరుగుతుంది. చివరికి ఆడవారికైనా, మగవారికైనా పొట్ట భాగంలో ఉండే కొవ్వు తగ్గితే బాగుండు అనిపిస్తుంది.

                           ఇతర భాగాలలో కొవ్వు ఎక్కువగా ఉన్న జరిగే నష్టం కంటే పొట్ట భాగంలో ఉండే కొవ్వు వల్ల జరిగే నష్టం ఎక్కువ. దీని వలన మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, బద్దకంగా, ఫ్యాటీక్ గా ఎప్పుడు అలా ఉండటం, ఆయాసం ఎక్కువగా రావడం, గురక ఎక్కువగా రావడం వీటన్నిటికీ పొట్టలో ఉండే కొవ్వు కారణం. ఇలాంటి అబ్డమినల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏదైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే లీచీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ లీచీ ఫ్రూట్ పొట్టలో ఉండే కొవ్వు పైన బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని 2020 సంవత్సరంలో చైనా వారు దీనిపై రీసెర్చ్ చేశారు.

                              అబ్డమినల్ ఫ్యాట్ బాగా తగ్గడానికి లీచీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుందని వీరు నిరూపించారు. దీనిలో ఉన్న రీజన్ ఏమిటి అంటే ఈ ఫ్రూట్ బాగా తిన్నప్పుడు ఓలీగోనల్ అనే కెమికల్ కాంపౌండ్ ఇది పొట్టలో ఉండే కొవ్వును కరిగేటట్లు చేయడానికి, కొవ్వు ఆ ప్రదేశంలో నిల్వ ఉండకుండా చేయడానికి, కొవ్వు అక్కడి నుంచి బయటికి వచ్చి కరిగి వేరొక రూపంలో ఎనర్జీగా ఉపయోగపడడానికి ఇది ముఖ్యంగా మార్పు తీసుకొస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఈ లీచీ ఫ్రూట్ మనకు బాగా అందుబాటులో వస్తుంది. ప్రస్తుత కాలంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది.

                             ఈమధ్య తెలుగు రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. ఇందులో ఇంకోటి కూడా ఉంటుంది. ఇందులో రూటీన్ అనే సాలిబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు శరీరం గ్రహించకుండా చేస్తుంది. కనుక పొట్టలో ఉన్న కొవ్వు, బొజ్జ తగ్గాలి అనుకున్న వారు ఈ లీచీ ఫ్రూట్ బాగా తీసుకుంటే ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వును టార్గెట్ చేసి తగ్గిస్తుంది కాబట్టి వాడుకుంటే మంచిది.

Leave a Comment

error: Content is protected !!