అతిధులు ఇంటికి వస్తే ఇపుడంటే ఫ్రిజ్ లో పెట్టిన చల్లని కూల్డ్రింక్, లేక నిల్వ ఉంచిన ఫ్రూజ్ జ్యుస్ లు వంటివి ఇస్తున్నారు కానీ ఒకప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా నిమ్మకాయ కోసి కాసింత పంచదార, కుండలోని చల్లటి నీళ్లు కలిపి నిమ్మకాయ నీళ్లు ఇచ్చేవారు. దీని వెనుక కూడా కాసింత ఆరోగ్య సూత్రముంది. బయట నుండి వచ్చిన వాళ్ళు ప్రయాణం చేసి లేక కాసింత అయిన దూరం నుండి వచ్చి ఉంటారు. వారికి నిమ్మరసాన్ని అందించడం వల్ల అలసట, నీరసం తగ్గి ఒంట్లో శక్తి పుంజుకుంటుంది, బయట తిరగడం ద్వారా కోల్పోయిన తేమను భర్తీ చేసి శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. నిమ్మకాయలో పవరేంటో ఒక సంఘటతోనే తెల్సిపోయిందిగా….. ఇక వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయ ప్రాధాన్యం ఎంతో అందరికి తెలిసిందే. అలాంటి నిమ్మకాయ రసాన్ని రోజు ఉదయాన్నే తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు. ఇంగకు అవేంటో ఒకసారి మనం తెలుసుకుని మన లైఫ్ లో భాగం చేసుకుందాం పదండి మరి చదివేద్దాం.
◆ నిమ్మకాయలో ముఖ్యంగా విటమిన్-సి ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసినదే. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసేది మరియు మనల్ని జబ్బుల నుండి కాపాడేది విటమిన్ సి అనే విషయం కూడా మనకు తెలుసు. ప్రతిరోజు ఉదయాన్నే గ్లాసుడు వేడి నీళ్లలో అరచెక్క నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఇక ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల సిట్రస్ తొందరగా శక్తివంతంగా పనిచేస్తుంది.
◆ప్రస్తుతం ఎందరినో వేధిస్తున్న సమస్య గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి. ఉదయాన్నే నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యలను తగ్గిస్తుంది.
◆నీటిని తక్కువగా తీసుకునే వారిలో ఎదురయ్యే చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం, గాయాలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందుకే నిమ్మరసం తీసుకుంటే శరీరం ను హైడ్రేషన్ లో ఉంచవచ్చు.
◆కారణాలు ఏవైనా బిగుసుకుపోయిన కండరాలు, మరియు ఎముకలను ఉత్తేజపరిచి కీళ్లనొప్పులు తగ్గించడంలో నిమ్మ సమర్థవంతంగా పనిచేస్తుంది.
◆రాత్రి తిన్న ఆహారం తాలూకు జీర్ణక్రియ ద్వారా వెలువడిన యాసిడ్లను క్రమబద్దీకరించడంలో నిమ్మరసం చక్కగా పని చేస్తుంది.
◆ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిగానే కాకుండా యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. వృద్ధాప్యాన్ని దరికి రానివ్వకుండా, మన శరీర మెటబాలిజల్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
◆జ్వారం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఉన్నపుడు నిమ్మరసం నీళ్లు తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరిగి తొందరగా జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది.
◆మధుమేహం ఉన్న వారు రోజూ దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
◆ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తీసుకోవడం వల్ల తొందరగా రక్తంలోకి చేరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మన శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది. అంతేకాదు రోజు మొత్తం చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది
చివరగా….
వందలు వేలు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి బరువు తగ్గడంలో విఫలమైన వాళ్ళు కూడా నిమ్మరసం ను ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్న నిమ్మకాయలను, నిమ్మరసాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మరి.